​'సిద్ధార్ధ' యూనిట్ స‌మ‌క్షంలో నిర్మాత దాస‌రి కిర‌ణ్‌కుమార్ పుట్టిన‌రోజు వేడుక‌

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న హీరో ఆర్‌.కె.నాయుడు. ఆయ‌న హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న తాజా సినిమా 'సిద్ధార్థ‌'. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాణిని నంద్వాని నాయిక‌లు. ఈ చిత్ర నిర్మాత, గ‌తంలో 'జీనియ‌స్‌', 'రామ్‌లీల‌' సినిమాల‌ను నిర్మించిన నిర్మాత, మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కారనే పేరు తెచ్చుకున్న నిర్మాత... దాస‌రి కిర‌ణ్‌కుమార్‌. శ‌నివారం ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను చిత్ర యూనిట్ స‌మ‌క్షంలో నిర్వ‌హించుకున్నారు. యూనిట్ స‌భ్యులంద‌రూ దాస‌రి కిర‌ణ్‌కుమార్ కేక్ క‌టింగ్‌లో పాల్గొన్నారు.

అనంత‌రం దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ''మా 'సిద్ధార్థ‌'కు సంబంధించి ఇప్ప‌టికి రెండు షెడ్యూళ్ళు పూర్తి అయ్యాయి. మ‌లేషియాలో తొలి షెడ్యూల్‌ను చాలా భారీగా నిర్వ‌హించాం. రెండో షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లోనే చేశాం. మూడో షెడ్యూల్ డిసెంబ‌ర్ 17 నుంచి ఏక‌ధాటిగా 25 రోజుల పాటు హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతుంది. దాంతో సినిమా మొత్తం పూర్త‌వుతుంది. మొత్తం నాలుగు పాట‌లుంటాయి. మ‌ణిశ‌ర్మ‌గారు వీనుల‌విందైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి గారి లాంటి టాప్‌మోస్ట్ టెక్నీషియ‌న్ మా సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. వైవిధ్య‌మైన జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. . బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్.కె. నాయుడికి ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుంది. ఇందులో పవర్ ఫుల్ రోల్ ను ఆయ‌న‌ బ్రహ్మండంగా చేస్తున్నారు'' అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, ఛాయాగ్రాహ‌కుడు ఎస్‌.గోపాల్ రెడ్డి, సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు బి.కాశీ విశ్వ‌నాథ్‌, కాట్రు శేషుకుమార్‌, టి.స‌త్యారెడ్డి, ముత్యాల ర‌మేశ్‌, లంకాల బుచ్చిరెడ్డి, ర‌చ‌యిత విస్సు, ద‌ర్శ‌కుడు సిరిపురం కిర‌ణ్‌, మ‌ల్టీడైమ‌న్ష‌న్ వాసు, టి.సాయిబాబు, న‌టుడు కృష్ణుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ - విసు, రచనా సహకారం - రవిరెడ్డి మల్లు, కెమెరా - యస్.గోపాల్ రెడ్డి, సంగీతం - మణిశర్మ, సాహిత్యం - అనంత శ్రీరామ్, మాటలు - పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఫైట్స్ - సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - ముత్యాల రమేశ్, సమర్పణ - లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాల‌త - దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దయానంద్ రెడ్డి.