హీరోయిన్ తో చైతు ప్రేమను బయటపెట్టిన దాసరి..!
Wednesday, September 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న ప్రేమకథా చిత్రం ప్రేమమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ చైతు ప్రేమ వ్యవహారాన్నిబయటపెట్టారు. ఇంతకీ దాసరి ఏమన్నారంటే...చైతుని చూస్తే మన పక్కింటి కుర్రాడులా ఉంటాడు. చైతు నవ్వులో ఏదో మాయ ఉంది. ఆ మాయతోనే హీరోయిన్ ని లవ్ లో పడేసాడు. అలాగే ఆ హీరోయిన్ ఏమాయచేసిందో కానీ చైతు లవ్ లో పడిపోయాడు అంటూ దాసరి చైతు లవ్ గురించి మాట్లాడడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments