దాసరి మృతికి సంతాపం తెలియజేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకరత్న దాసరి నారాయణరావు స్వర్గస్తులైన నేపథ్యంలో బుధవారం ఉదయం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతాప సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట రొడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీ-సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి, ఎంఎల్ సీ ఫరూక్, టీ-ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, టీ- జాయింట్ సెక్రటరీ జెవీఆర్, టీ-మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత, టీ-ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ సాయి వెంకట్ జమున, గీతాజంలి, మల్కాపురం శివకుమార్, సురేష్ కొండేటి, తుమ్మల పల్లి రామసత్యనారాయణ , కట్టా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ` దాసరి గారి భార్య పద్మగారిది మా సత్తుపల్లే. ఆయన ఎప్పుడూ మా ఊరు వస్తుండేవారు. రాజ్య సభ సబ్యుడిగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించి సత్తుపల్లి ని అభివృద్ది చేశారు. ఇక సినిమా రంగంలో ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం. ఎంతో మందికి సహాయసహకాలరు అందించిన వ్యక్తి ఈ రోజు మధ్యన లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్ధిస్తున్నా` అని అన్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ` తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయాం. ఆయన మరణం పరిశ్రీమకు తీరని లోటు. దాసరిగారు మరో పదేళ్ల పాటు ఉండుంటే పరిశ్రమకు మరిన్ని మంచి పనులు జరిగేవి. చిన్న నిర్మాతలకు ఆయన అండలా ఉండేవారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవారు. ఎఫ్ ఎన్ సీసీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే ఫిలిం ఛాంబర్, చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఆయన ఎంతో సహకారం అందించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా` అని అన్నారు.
టీ-మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత మాట్లాడుతూ, ` సినీ పరిశ్రమలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా పరిష్కరించే ఎకైక వ్యక్తి దాసరి గారు. చిన్న నిర్మాతలకు ఆయన ఓ బలం. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
దర్శకుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ, ` అనాధ అనే పదం విన్నాను. కానీ దాని అర్ధం దాసరి గా మరణం తర్వాత తెలిసింది. ఆయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేదు. నిజాన్ని చెప్పడానికి ఎమోషన్ చాలా అవసరం అనేవారు. అది నా ప్రాక్టికల్ లైఫ్ లో తర్వాత అర్ధమైంది` అని అన్నారు.
టీ-ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ సాయి వెంకట్ మాట్లాడుతూ, ` పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments