నా ఇంటి గోడ నేను దూకితే తప్పేంటి? : దాసరి అరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకరత్న దాసరి నారాయణఱావు కుమారులైన దాసరి ప్రభు, అరుణ్‌ల మధ్య ఆస్థిపరమైన గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అరుణ్ ఇంటి గోడ దూకి వచ్చాడని, మద్యం తాగి దాడి చేసే ప్రయత్నం చేశాడంటూ ప్రభు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి వివరణ ఇస్తూ దాసరి అరుణ్ శనివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దాసరి అరుణ్ మాట్లాడుతూ ‘‘నాకు, అన్నయ్యకు, మా సోదరికి ఎలాంటి గొడవలు లేవు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అన్నయ్యకు సమస్యలుంటే న్యాయ పరమైన పోరాటం చేయవచ్చు. నేను కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాను. ఇల్లు మా ముగ్గురి పేరుపైన ఉంది. మా ఇంట్లోకి నేను వెళ్లాను. ఆక్రమంగా వెళ్లలేదు.. ఎవరిపైనా దౌర్జన్యం చేయలేదు. సినీ పెద్దలు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని అంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. నాన్నగారు ఇంటిని ముగ్గురు పేరు మీద రాశారు. నా ఇంటి గోడ నేను దూకితే తప్పేంటిఝ చాలా సార్లు మా ఇంటి గోడను దూకాను. సినీ పరిశ్రమలో వివాదాలకు పరిష్కారం చూపిన దాసరి కుమారులు రోడ్డెక్కడం బాగోలేదని అందరూ అనుకుంటున్నారు. అలాగే ఆస్థుల వివాదంలో చిరంజీవి, మోహన్ బాబు, సి.కల్యాణ్ పేర్లను ప్రస్తావించడం సరికాదు’’ అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments