అక్కినేని అఖిల్ కి దర్శకరత్న దాసరి సలహా..!
- IndiaGlitz, [Wednesday,September 21 2016]
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తొలి చిత్రం అఖిల్ ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదన్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అఖిల్ తదుపరి చిత్రాన్ని విక్రమ్ కుమార్ తో చేయనున్నట్టు నాగార్జున ప్రకటించారు.
ఇదిలా ఉంటే...ప్రేమమ్ ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకరత్న దాసరి మాట్లాడుతూ...అక్కినేనితో 27 సినిమాలు చేస్తే అందులో 22 ప్రేమకథా చిత్రాలే. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అక్కినేని కుటుంబం. ప్రేమకు అర్ధం అక్కినేని కుటుంబం. నాగార్జునతో ఆ చరిత్ర పునరావృతం అయ్యింది. ఇప్పుడు చైతన్య తో కంటిన్యూ అవుతుంది. అఖిల్ తో కూడా ఈ చరిత్ర కంటిన్యూ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రేమకు మరణం లేదు. ప్రేమకథా చిత్రాలకు ఉన్న చరిత్ర ఏ సినిమాకు ఉండదు. అందుచేత అఖిల్ కూడా తదుపరి చిత్రం ప్రేమకథా చిత్రమే చేయాలని కోరుకుంటున్నాను అంటూ సలహా ఇచ్చారు దర్శకరత్న దాసరి..!