దసరా కి బాహుబలి 2 రిలీజ్..

  • IndiaGlitz, [Wednesday,March 09 2016]

ద‌స‌రాకి బాహుబ‌లి 2 రిలీజ్...అన‌గానే బాహుబ‌లి 2 సినిమా అనుకుంటే పొర‌పాటే. బాహుబ‌లి 2 టీజ‌ర్ ని ద‌స‌రాకి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి త‌ర్వాత పెద్ద పండ‌గ అంటే ద‌స‌రానే. అందుక‌నే సంక్రాంతి త‌ర్వాత ద‌స‌రాకి సినిమాల‌ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తుంటారు. సినిమా రిలీజ్ కుద‌ర‌క‌పోతే టీజ‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
బాహుబ‌లి టీమ్ కూడా అదే చేస్తుంది. ద‌స‌రా రోజున టీజ‌ర్ రిలీజ్ చేస్తే..అంద‌రి దృష్టి బాహుబ‌లి 2 పైనే ఉంటుంది. మీడియా నుంచి కావ‌ల్సినంత కంటే ఎక్కువే ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌ని భావిస్తుంద‌ట‌. ఈ సంవ‌త్స‌రంలోనే బాహుబ‌లి 2 సినిమాని రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ...షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల‌న వ‌చ్చే సంవ‌త్స‌రం రిలీజ్ చేయ‌నున్నారు. 2017 ఏప్రిల్ 14న బాహుబ‌లి 2 రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించారు. బాహుబ‌లి 1 ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 650 కోట్లు వ‌సూలు చేసింది. మ‌రి...బాహుబ‌లి 2 ఎంత క‌లెక్ట్ చేస్తుందో చూడాలి.

More News

చిరు 150వ మూవీకి ముహుర్తం కుదిరింది..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

సందీప్ కిషన్ 'ఒక్క అమ్మాయి తప్ప' కోసం పాట పాడిన తమన్

సాధారణం గా ఇద్దరు లీడింగ్ మ్యూజిక్ డిరెక్టర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది.కానీ పోటీ కంటే ఫ్రెండ్షిప్ గొప్పది అని నిరూపిస్తూ,

'నాయకి' పాట రికార్డింగ్ పూర్తయ్యింది....

త్రిష ప్రధాన పాత్రలో గోవి దర్శకత్వంలో రాజ్ కందుకూరి సమర్పణలో మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం ‘నాయకి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వారాహిచలనచిత్రం చేతిలో సావిత్రి సీడెడ్ హక్కులు

మంచి చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ వాటి విజయంలో కీలక పాత్ర పోషించడంలో వారాహి చలన చిత్రం ఎప్పుడూ ముందుంటుంది.

ఇద్దరిలో బాలయ్య ఎవరితో....

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందనున్న వందవ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.