భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ : వేదికపై మొగిలయ్యకు సన్మానం.. ఫ్యాన్స్ కోసం మరోసారి పాట
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కిన్నెర కళాకారుడు పద్మశ్రీ , దర్శనం మొగిలయ్య కూడా హాజరయ్యారు. భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడిన తర్వాత మొగిలయ్యకు కిన్నెర కళకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన కళని గుర్తించడం, పద్మశ్రీ అవార్డుకు గాను కేంద్రానికి మొగిలయ్య పేరు సిఫారసు చేసింది. తర్వాత మొగిలయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి స్థలం, రూ. కోటి డబ్బు నజరానా ప్రకటించారు.
తాజాగా భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మొగిలయ్య రావడంతో.. పోలీసులు ఆయనను గౌరవంగా లోపలకి తీసుకెళ్లారు. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో.. పోలీసులు వారిని చెదరగొట్టి, మొగిలయ్యను వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మొగిలయ్యకు సన్మానం చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాట పాడిన తర్వాత గొప్ప పేరు వచ్చిందని, ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలే అంటూ మొగిలయ్య చెప్పారు. ఢిల్లీలో నాకు అవార్డు వచ్చిందని.. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానం చేశారని ఆయన పేర్కొన్నారు.
పవన్ సార్ కూడా నన్ను పిలిచి సత్కరించి... ఆర్థిక సాయం చేశారు. ఈ సినిమాలో పాట పడితే ఇంత పెద్దగా అవుతుందని ఊహించలేదని మొగిలయ్య హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఫ్యాన్స్ కోరికమేరకు తన కిన్నెరతో వేదికపై భీమ్లా నాయక్ సాంగ్ పాడి అలరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout