రిలీజ్ కు రెడీ అవుతోన్న 'డార్లింగ్2'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కె.ఇ. జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమిళ చిత్రం డార్లింగ్ 2. ఈ చిత్రాన్ని వరుణ్ చౌదరి సమర్పణలో ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో డార్లింగ్ 2 అనే పేరుతోనే విడుదల చేస్తున్నారు. కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
సతీష్ చంద్రశ్రేఖరన్ దర్శకుడు. మాధురి బొల్లు నిర్మాత. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోడానికి సిద్ధమైంది. దర్శకుడు సతీష్ చంద్రశేఖరన్ అతని ఐదుగురు స్నేహితలు హాలీడేలో జరిగిన ఘటనను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్, హరి, అర్జునన్, రాందాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగతం: రథన్, మాటలు: రాజశేఖర్ రెడ్డి, పాటలు: శివగణేష్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్, నిర్వహణ: మాధవి, సహ నిర్మాత: షషిత మైనేని, నిర్మాత: మాధురి బొల్లు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ చంద్రశేఖరన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com