ఏపీలో డేంజర్ బెల్స్: 2 వారాల్లో 24 వేల మంది పిల్లలకు కరోనా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. చిన్న పిల్లల విషయంలో కొత్త భయాందోళన మొదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడచిన రెండు వారాల్లో అంటే మే 18 నుంచి 31 వరకు ఏపీలో 2.3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.
అందులో దాదాపు 24 వేల మంది 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఇందులో 2,200 మంది 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు కావడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా పాజిటివ్ గా తేలిన పిల్లలో 4,200 మంది ఈస్ట్ గోదావరికి చెందిన వారే. ఈ జిల్లాని ప్రభుత్వం మేజర్ హాట్ స్పాట్ గా పరిగణిస్తోంది.
ఆ తర్వాతి స్థానంలో 3,800 కేసులతో చిత్తూరు జిల్లా ఉంది. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పిల్లలో కరోనా వైరస్ లక్షణాలు పెద్దల్లో ఉన్నత ప్రమాదకరంగా లేవు. కానీ వారి ద్వారా కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది అని అంటున్నారు.
దీనితో పిల్లలపై ప్రత్యేక దృష్టిని ప్రభుత్వం సారించాలని విద్య హక్కు ఫోరమ్ స్టేట్ కన్వీనర్ నారాయణ రావు అభిప్రాయపడ్డారు. కరోనా ఫస్ట్ వేవ్ వృద్దులపై ప్రభావం చూపింది. సెకండ్ వేవ్ యువతపై ప్రభావం చూపుతోంది. కాబట్టి థర్డ్ వేవ్ పిల్లలపై ఉంటుంది అనేది ఒక అంచనా మాత్రమే అని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com