Dangal Actress:చిత్ర పరిశ్రమలో విషాదం.. దంగల్ నటి కన్నుమూత..

  • IndiaGlitz, [Saturday,February 17 2024]

హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్‌ ఖాన్‌ 'దంగల్‌' మూవీలో నటించిన బాలనటి సుహాని భట్నాగర్ కన్నుమూసింది. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 19 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె అకాల మరణం పట్ల బాలీవుడ్ నటులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మరణవార్తపై అమిర్ ఖాన్‌కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. మా గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటావ్.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ప్రకటించింది.

కొంతకాలం క్రితం సుహానికి యాక్సిడెంట్ కావడంతో కాలు విరిగింది. దీంతో ఆమె చికిత్స కోసం మందులు తీసుకుంటోంది. అయితే అవి దుష్ప్రభావం చూపించడంతో ఆమె శరీరమంతా నీరు పేరుగుపోవడం మొదలైంది. వెంటనే ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సుహానీ.. ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15లోని అజ్రౌండా శ్మశాన వాటికలో భట్నాగర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాగా 2016లో అమీర్‌ ఖాన్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ 'దంగల్‌' బబితా ఫోగట్‌ పాత్రలో సుహాని నటించింది. అమీర్ రెండో కూతురిగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకులు కూడా ఆమె పాత్రను బాగా గుర్తు పెట్టుకున్నారు. పలు వాణిజ్య ప్రకటనలతో పాటు పలువురు స్టార్లతో కలిసి నటించింది. అయితే చదువు కోసం కొద్దిరోజులుగా ఇండస్ట్రీగా దూరంగా ఉంటుంది. చదువు పూర్తి చేశాక తిరిగి సినిమాల్లో నటిస్తానని పలు ఇంటర్వ్యూల్లో కూడా వెల్లడించింది. కానీ ఇలా అర్థాంతరంగా చిన్న వయసులోనే మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అలాగే సుహాని మరణవార్త విని నెటిజన్లు కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

More News

Uttam: కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్య్ర భారతంలోనే అతి పెద్ద కుంభకోణం: ఉత్తమ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.

CM Revanth Reddy:అసెంబ్లీలో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ చంద్రబాబే.. నిగ్గుతేల్చిన సీఐడీ..

ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టర్ మైండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు ఇది రుజువైంది.

Hanuman:ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. 'హనుమాన్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే..?

సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైంది. పెద్ద సినిమాల ధాటికి థియేటర్లు కూడా దక్కలేదు.

Veera shankar :దర్శకుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వీరశంకర్

ఇటీవల జరిగిన తెలుగు చలనచిత్ర దర్శకుల ఎన్నికలలో వీరశంకర్(Veera Shankar) ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.