'దండుపాళ్యం 4' పోస్టర్ లాంచ్

  • IndiaGlitz, [Wednesday,February 28 2018]

వెంక‌ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.టి.నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ నిర్మిస్తున్న చిత్రం 'దండుపాళ్యం 4'. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..

నిర్మాత వెంక‌ట్ మాట్లాడుతూ - ''దండుపాళ్యం పార్ట్ 1, పార్ట్‌2ల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఆద‌రించారు. వారిచ్చిన స్ఫూర్తితో దండుపాళ్యం 4ను ప్రారంభించాం. దండుపాళ్యంపై క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతుంది. ఇప్పుడు దండుపాళ్యం 3కి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది తెలియ‌దు. ఆర్టిస్టుల గురించి పెద్ద‌గా తెలియ‌దు. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం, నా కృషితో రెండు సినిమాలు ప్ర‌జ‌ల‌కు బాగా రీచ్ అయ్యాయి. ద‌ర్శ‌కుడు కె.టి.నాయ‌క్ మంచి ఇంటెలిజెంట్‌.. హార్డ్‌వ‌ర్క‌ర్‌. ఈయ‌న‌కు క్రైమ్ జోన‌ర్‌లో సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. ఆయ‌న ఎలా దండుపాళ్యం 4 చేయ‌వ‌చ్చో చెప్పిన తీరు నాకు న‌చ్చింది. దండుపాళ్యం, బాహుబ‌లి రెండు సినిమాల రేంజ్ వేరైనా ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌కి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యాయి. కొంద‌రి వ్య‌క్తిగ‌త అహాల కార‌ణంగా దండుపాళ్యం 2 నేను అనుకున్న‌ట్లుగా రాలేదు.

ఆడియెన్స్‌ను ఏమైతే సినిమాలో ఉండాలనుకుని థియేట‌ర్‌కి వ‌చ్చారో అది సినిమాలో లేదు. దాంతో ఓ క‌సితో దండుపాళ్యం 4ను స్టార్ట్ చేశాను. ప‌క్కా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో సినిమాను స్టార్ట్ చేస్తున్నాం. మార్చి 8న సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దండుపాళ్యం4 లో రెండు గ్యాంగ్‌లుంటాయి. మొద‌టి మూడు పార్ట్స్‌లో న‌టించిన నటీన‌టుల‌తో పాటు వేరే గ్యాంగ్ కూడా ఇందులో క‌న‌ప‌డుతుంది. దండుపాళ్యం రీసెర్చ్‌లో మాకు దొరికిన స‌మాచారంతో ప‌ది సీక్వెల్స్ తీయ‌వ‌చ్చు. నిజ‌మైన ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఆస‌క్తిక‌రమైన స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుంది'' అన్నారు.

ద‌ర్శ‌కుడు కె.టి.నాయ‌క్ మాట్లాడుతూ - ''నేను నిజామాబాద్ ఆర్మూర్‌లో పుట్టి పెరిగాను. కానీ త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో స్థిర‌ప‌డ్డాను. నాకు ఇచ్చిన ప‌నిని 100 శాతం నేర‌వేరుస్తాను. ప్రొడ్యూస‌ర్‌గారికి థాంక్స్‌. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ధీటుగా ఈ సీక్వెల్ ఉంటుంది'' అన్నారు.

వోల్గా బాబ్జీ మాట్లాడుతూ ''వెంక‌ట్‌గారికి అత‌ని టీంకు అభినంద‌న‌లు'' అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - ''నా సినిమాల్లో కూడా మ‌హాత్మ 2. పెళ్లి సంద‌డి 2 వంటి సినిమాలు చేయాల‌ని చాలా మంది అనుకున్నారు కూడా. ఇక దండుపాళ్యంకు ఉన్న క్రేజ్ తెలిసింది. ముందు విడుద‌లైన సినిమాలు ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించాయో అంద‌రికీ తెలిసిందే. ఇందులో విష‌యాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని పార్టులైనా షూటింగ్ చేయ‌వ‌చ్చు. నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల ఆధారంగా చేసిన సినిమాలు ఇవి. దండుపాళ్యం 4 పెద్ద విజ‌యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నటీనటులు: మకరంద్ దేశ్ పాండే, పూజాగాంధీ,రవికాలే,పెట్రోల్ ప్రసన్న,ముని,జయదేవ,కరిసుబ్బు,రవిశంకర్, స్నేహ, సంజీవ్, అరుణ్ బచ్చన్, సోము తదితరులు.
ఈ చిత్రాణికి కెమెరా: ఆర్.గిరి, ఆనంద్ రాజా విక్రమ్, ఎడిటర్: బాబు.ఎ.శ్రీవాత్సవ, ప్రీతి మోహన్; నేపధ్య సంగీతం: అర్జున్ జన్య,
నిర్మాత: వెంకట్ దర్శకత్వం: కె.టి. నాయక్

More News

'ఐతే 2.0' సాంగ్‌ను విడుద‌ల చేసిన ఎం.ఎం.కీర‌వాణి

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుద‌ల‌వుతుంది.

జూన్ 14న దిల్ రాజు, రాజ్ తరుణ్ ల 'లవర్'

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల' తో సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ ను స్టార్ట్చేసిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

వర్మ ప్రేమలేఖ

ఇటీవల నటి శ్రీదేవి హఠాన్మరణం చాలా మంది అభిమానులను బాధించిన సంగతి తెలిసిందే.

శ్రియ పెళ్లి డేట్ ఖరారు

హీరోయిన్ శ్రియ పెళ్లిపై వార్తలు మరోసారి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

చంద్రబాబు నాయుడుకి, 'భరత్ అనే నేను' చిత్రానికి ఓ లింక్..

'శ్రీమంతుడు'వంటి విజయవంతమైన చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో