'దండుపాళ్యం3' మోషన్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇటీవల విడుదలైన 'దండుపాళ్యం2' కూడా రెండు భాషల్లోనూ సూపర్‌హిట్ అయింది. 'దండుపాళ్యం' సీక్వెల్స్‌లో భాగంగా ఇప్పుడు 'దండుపాళ్యం3' రాబోతోంది.
ఆర్4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రజని తాళ్ళూరి నిర్మిస్తున్న 'దండుపాళ్యం3' షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్, ఎడిటింగ్: రవిచంద్రన్, నిర్మాత: రజనీ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com