ఘ‌నంగా 'దండుపాళ్యం -3' ఆడియో ఫంక్ష‌న్‌

  • IndiaGlitz, [Monday,February 26 2018]

దండుపాళ్యం గ్యాంగ్ కి క‌న్న‌డ‌లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రాజు రియ‌లిస్టిక్ గా తెర‌కెక్కించారు. అలా చేసిన‌ దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచయిస్ లో చివ‌రి పార్టు గా ధండుపాళ్యం-3 తీసుకొస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో దండు పాళ్యం చిత్రం ద్వారా ఆ గ్యాంగ్ కి స‌ప‌రేట్ క్రేజ్‌ సంపాదించుకున్నారు.

శ్రీనివాస రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సెన్సేషనల్ చిత్రం మ‌రోక్క‌సారి తెలుగు ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయ‌నుంది. ఈ చిత్రాన్ని శ్రీ వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర క్రియోష‌న్స్ వారు తెలుగు లో విడుద‌ల చేస్తున్నారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశిస్సులతో.. సాయి కృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో... శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస్ మీసాల, సాయి కృష్ణ పెండ్యాల‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈచిత్రానికి సంభందించిన ఆడియో ఫంక్ష‌న్ ప్ర‌సాద్ ల్యాబ్ గ్రౌండ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ , నేను లోక‌ల్ ద‌ర్శకుడు త్రీనాధ్ , ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావు గారు, ప్ర‌ముఖ నిర్మాత మ‌ర్కాపురం శివ‌కుమార్ గారు ముఖ్య అతిధులుగా హ‌జ‌ర‌య్యారు. అంతేకాకుండా మెట్ట‌మెద‌టిసారిగా ఈ చిత్రంలో న‌టించిన గ్యాంగ్ మెత్తం ఈ కార్య‌క్ర‌మానికి హ‌జ‌రవ్వ‌టం విశేషం.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ పూజాగాంధి మాట్లాడుతూ.. నేను చాలా గ్లామ‌ర్ రోల్స్ చేశాను. కాని దర్శ‌కుడు శ్రీనివాస రాజు గారు చెప్పిన క‌థ , క‌థ‌నం న‌చ్చి ఈ దండుపాళ్యం చేశాను కాని ఆయ‌న వ‌రుస‌గా మూడు పార్టులు తీసారు. ఇప్ప‌డు మా గ్యాంగ్ అంద‌ర్ని దండుపాళ్యం గ్యాంగ్ అంటున్నారు. మెమె ఇంత‌కుముందు చేసిన పాత్ర‌లు మ‌ర్చిపోయారు. లక్ష్మి పాత్ర‌కు నేను కొంచెం క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. నా బాడీ లాంగ్వేజ్ తో నా మాట‌తీరు అన్ని మార్చుకోవాల్సి వ‌చ్చింది. పార్టు 3 కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. అన్నారు.

మ‌క‌రంద్ పాండే మాట్లాడుతూ... ఈ చిత్రం లో నా న‌వ్వుని సిగ్నీచ‌ర్ స్మైల్ గా మార్చారు. ఈ సినిమా త‌రువాత మ‌మ్మ‌ల్ని ప్రేక్ష‌కులు చూసే తీరు మారిపోయింది. క్రూరంగా గోరంగా చూస్తున్నారు. మీరు దండుపాళ్యం గ్యాంగ్ క‌దాని అడుగుతున్నారు. చాలా హ్య‌పి గా వుంది. పాత్ర‌ల్ని గుర్తుపెట్టుకున్నారు అంటే అదే మా విజ‌యం. అయితే స్క్రీన్ మీద కంటే మేమంతా ఇన్నోసెంట్ పిల్ల‌లం. దండుపాళ్యం 3 మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను.. అని అన్నారు.

రవికాలే మాట్లాడుతూ.. తెలుగులో చాలా చిత్రాలు చేశాను కాని ఈ చిత్రానికి వ‌చ్చిన గుర్తింపు మ‌రే చిత్రానికి కూడా రాలేదు. మంచి డ్ర‌స్‌లు వేసుకుని హుందాగా న‌టింన‌ప్పుడు బాగానే చేశాడు అన్నారు. కాని ఈ గ్యాంగ్ లో క‌న‌పడితే మీరు దండుపాళ్యం గ్యాంగ్ క‌దా అని అడుగుతున్నారు. ద‌ర్శ‌కుడు శ్రీనివాస రాజు గారికి మా ధ‌న్య‌వాదాలు.. అన్నారు.

వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ.. ఇలాంటి రా చిత్రాలు తీయ‌లంటే అంద‌రివ‌ల్ల కాదు.. దానికి ఎంతో ధైర్యం కావాలి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించాల‌న్నా దానికి మించిన గ‌ట్స్ కావాలి. ద‌ర్శ‌కుడు శ్రీనివాస రాజు గారు మెద‌టి పార్టుతోనే త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇలాంటి సినిమా ఓపార్టు తీస్తేనే మ‌న ర‌సం కారిపోతుంది అలాంటిది ఆయ‌న మూడు పార్టు లు తీసి స‌క్స‌స్‌ఫుల్ గా దూసుకుపోతున్నాడంటే మామూలు మేట‌ర్ కాదు. అలాగే తెలుగు లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న సాయి గారికి, శ్రీనివాస్ గారికి నా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను.. అని అన్నారు.

త్రినాధ్ మాట్లాడుతూ.. య‌ధార్ద సంఘ‌ట‌న‌ల ఆదారంగా తెరకెక్కించిన దండుపాళ్యం చిత్రం అన్ని పార్టులు మంచి విజ‌యాలు సాధించాయి.. ఇప్ప‌డు ఈ చివ‌రి పార్టు దండుపాళ్యం 3 కూడా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని నిర్మాత‌లు మీసాల శ్రీనివాస్‌, సాయి కృష్ణ పెండ్యాల కు మంచిగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. అన్నారు

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావు మాట్లాడుతూ.. మెము ఇప్ప‌టికి 365 చిత్రాలకి రాసాము. ఈ ద‌ర్శ‌కుడు ఏచిత్రం గురించైనా 365 రోజులు డిస్క‌స్ చెయ్య‌గ‌ల‌డు అంత సినిమా నాలెడ్జ్ వున్న‌వాడు. చాలా టాలెంట్ వున్న ద‌ర్శ‌కుడు. వ‌రుస‌గా సీక్వెల్స్ తో హిట్స్ కొడుతున్నాడు. ఇప్ప‌డు ఈ చిత్రం కూడా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కొరుకుంటున్నాను.అ అని అన్నారు.

నిర్మాతలు శ్రీనివాస్ మీసాల, సాయికృష్ణ పెండ్యాల‌ మాట్లాడుతూ.. మ‌హ‌నుభావుడు, ఆనందోబ్ర‌హ్మ‌, ఓక్క‌క్ష‌ణం లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల్ని పంపిణి చేసాము. ఈ సంవ‌త్స‌రం దండుపాళ్యం 3 చిత్రం తో నిర్మాత‌గా సినిరంగ ప్ర‌వేశం చేశాము. ద‌ర్శ‌కుడు శ్రీనివాస రాజు చాలా మంచి ద‌ర్శ‌కుడు. ఆయ‌న క‌మిట్‌మెంట్ క‌థ‌ని కన్విన్స్ చేసే విధానం చాలా బాగుంటాయి. ప్రేక్ష‌కులు థ్రిల్ గా ఫీల‌వుతారు.

ఈ దండుపాళ్యం పార్ట‌ల‌న్ని మంచి విజ‌యాలు సాధించాయి. చివ‌రి పార్టు గా వ‌స్తున్న దండుపాళ్యం 3 మార్చి లో విడుద‌ల కానుంది. మంచి విజ‌యం సాధింస్తుందనే న‌మ్మ‌కం వుంది. అయితే ఇలాంటి మంచి అవ‌కాశాన్ని మాకు అందించిన ద‌ర్శ‌కుడికి మా ధ‌న్య‌వాదాలు. అర్జున్ జ‌న్యా సంగీతం చాలా బాగుంది. అని అన్నారు.