జూలై 14న 'దండుపాళ్యం-2'
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 'దండుపాళ్యం' పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి 10 కోట్లు కలెక్ట్ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2' చిత్రాన్ని నిర్మాత వెంకట్ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ - ''తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్లో నిర్మిస్తున్న 'దండుపాళ్యం-2' చిత్రాన్ని జూలై 14న తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. రియల్ ఇన్సిడెంట్స్తో ఎంతో నేచురల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. దండుపాళ్యం చిత్రాన్ని మించి 'దండుపాళ్యం2' సూపర్‌హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాకు వుంది'' అన్నారు.
దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్ సినిమాలను అద్భుతంగా రిసీవ్ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు.
బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య, కో-డైరెక్టర్: రమేష్ చెంబేటి, నిర్మాణం: వెంకట్ మూవీస్, నిర్మాత: వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments