పోస్ట్ ప్రొడక్షన్ లో 'దండుపాళ్యం-2'

  • IndiaGlitz, [Wednesday,May 17 2017]

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా 30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. 'దండుపాళ్యం' పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి 10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2' చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత.
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న 'దండుపాళ్యం-2' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. తెలుగు, కన్నడ భాషల్లో 'దండుపాళ్యం' కలెక్షన్ల పరంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అద్భుతమైన కలెక్షన్స్‌తో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఇప్పుడు 'దండుపాళ్యం2' మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చెయ్యడానికి రెడీ అవుతోంది. డైరెక్టర్‌ శ్రీనివాసరాజు చిత్రాన్ని చాలా ఎక్స్‌లెంట్‌గా తీశారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే 'దండుపాళ్యం2' చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. దండుపాళ్యం చిత్రాన్ని మించి 'దండుపాళ్యం2' తెలుగు, కన్నడ భాషల్లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో, కన్నడలో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలాగే 'దండుపాళ్యం2' చిత్రంలోని కథ, కథనాలు చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు.
బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

More News

22న యూత్ ని ఆకట్టుకునే 'లవర్స్ క్లబ్' సినిమా టీజర్ లాంచ్

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని ,ఆర్యన్. పూర్ణి లు జంటగా మెట్టమెదటి సారిగా ఎమెషనల్ లవ్స్టోరి గా తెరకెక్కిన చిత్రం లవర్స్క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ముందు నుండి సినిమాల ఎంపికలో సెలక్టివ్ గానే ఉంటున్నాను - రీతూ వర్మ

ఎవడే సుబ్రమణ్యం,ప్రేమ ఇష్క్ కాదల్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో

అన్నీ ఎలిమెంట్స్ తో అందరికీ నచ్చే చిత్రం 'టిక్ టాక్ ' - హరినాథ్ పొలిచెర్ల

పి.హెచ్ ప్రొడక్షన్స్ నిర్మించిన హార్రర్,ఫన్,లవ్ కాన్సెప్ట్ మూవీ సినిమా 'టిక్ టాక్'.

రజనీకాంత్ తో నటించబోయే బాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే....

సూపర్ స్టార్ రజనీకాంత్ '2.0'తర్వాత హీరో ధనుష్ స్వంత బ్యానర్ వండర్ బార్స్ సంస్థలో

ఎన్టీఆర్ సినిమా సినిమాటోగ్రాఫర్ మారాడు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జై లవకుశ'.