మార్చి 16న దండుపాళ్యం 3 విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
దండుపాళ్యం ఈ పేరు వింటేనే కన్నడ సీమ అదిరిపోతుంది. బెంగుళూరు సిటీకి ముచ్చెమటులు పట్టించిన ఓ నొటోరియస్ కిల్లర్ గ్యాంగ్ కి పోలిసులు ఇచ్చిన బిరుదే దండుపాళ్యం. ఆ గ్యాంగ్ కి సంబంధించిన ఊరు పేరే ఈ దండుపాళ్యం. కన్నడంలో దండుపాళ్య అని అంటారు.
1996 నుంచి 2000 మధ్య బెంగుళూరు, చెన్నై పరిసర ప్రాంతాల్లో 80కి పైగా హత్యలు, రేప్ లు, దోపిడులు చేసిన హంతకులు ముఠా నేపథ్యంగా, యదార్ధా సంఘటణలు ఆధారంగా కన్నడ దర్శుకుడ శ్రీనివాస రాజా కన్నడనాట 2012లో కన్నడనాట దండుపాళ్య అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంలో ప్రముఖ శాండిల్ వుడ్ హీరోయిన్ పూజా గాంధీ కీలకపాత్ర పోషించారు.
థియేటర్ ఆర్ట్స్ యాక్టర్స్ రవికాలే, మకరందన్ దేశ్ పాండే తదితరులు ఈ చిత్రంలో నటించారు. పూజాగాంధీ, రవికాలే, మకరందన్ దేశ్ పాండే మినహా ఓ తొమ్మిది మంది నూతన నటీనటులతో దండుపాళ్యం చిత్రాన్ని 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస రాజు. ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నంలో భాగంగా కొద్దీగా బోల్డ్ గా ఈ సినిమాను తెరెక్కించి అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు.
హింసాప్రేరేపిత సన్నివేశాలు ఉన్నాయని ఈ చిత్ర ప్రదర్శన ఆపేయాలంటూ కన్నడనాట పెద్ద ఎత్తున ఆందోళన జరగడం దండుపాళ్యంకు మరింత ఊపును ఇచ్చింది, కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, మళయాలీ భాషల్లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 40 కోట్లకి పైగా గ్రాస్ ను వసూళ్ చేసింది ఈ క్ర్రైమ్ థ్రిల్లర్.
మొదటి భాగం ఇచ్చిన ఊపుతో అదే నటీనటులతో దండుపాళ్యంకి సీక్వెల్ ని 2014లో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసింది దర్శకుడు శ్రీనివాసరాజు అండ్ టీమ్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రెండో భాగం 2016 లో సెట్స్ పైకి వచ్చింది. 2017లో రిలీజై విజయాన్ని అందుకోంది అలానే దర్శకుడుతో పాటు నటీనటులకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ముఖ్యంగా ఈ రెండు భాగాలు తరువాత డైలాగ్ కింగ్ సాయికుమార్ సోదరుడు రవిశంకర్ కన్నడనాట యాక్టర్ గా బిజీ అయ్యాడు. ఓ వైపు తన గంభీరమైన గాత్రంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న రవిశంకర్, దండుపాళ్యం సీరిస్ తో నటుడిగా కూడా మరో మెట్టు ఎక్కాడు.
దండుపాళ్యం 2లో కన్నడ హాట్ బ్యూటీ సంజనా కూడా నటించింది. ఇక దండుపాళ్యం మొదటి, రెండు భాగాలతో ఆగని దర్శకుడు దండుపాళ్యం 3కి తెరలేపడం గతేడాది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మూడో భాగంలో కూడా మొదటి రెండు భాగాల్లో నటించిన నటీనటుల్నే తీసుకొని దండుపాళ్యం 3ని రెడీ చేశాడు దర్శకుడు శ్రీనివాస రాజు. మార్చి 16న విడుదల కాబోతున్న దండుపాళ్యం 3తో ఈ ట్రాయాలజీకి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా దర్శకుడు శ్రీనివాస రాజు ప్రకటించారు.
ఈ సక్సెస్ ఫుల్ సీరిస్ లో లేటెస్ట్ పార్ట్ ని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశిస్సులతో సాయి కృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస్ మీసాల, రజని తాళ్లూరి, సాయి కృష్ణ పెండ్యాల సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ చిత్ర తెలుగు హక్కులకు ఏర్పడ్డ క్రేజ్ దృష్ట్యా ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసినట్టు నిర్మాతలు చెబుతున్నారు. సహజత్వం కూడిన సన్నివేశాలతో, భావోద్వేగమైన డైలాగులతో ఈ కథ సాగుతుంది. 'దండుపాళ్యం 3' చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ 'దండుపాళ్యం' సీరిస్‌కి ఇదే చివరి పార్ట్ కావటంతో అసలు క్లైమాక్స్ ఎలా వుండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com