'దండు' పాటలు విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మంగమూరి శేషగిరి రావు సమర్పణలో యశస్విని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నీరజ్ శామ్, సాయికుమార్, నేహ సక్సేనా, దిశా ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం దండు`. సంజీవ్ మేగోటి దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. బిగ్ సీడీని శ్రీవాస్, ముప్పలనేనిశివ, ఆడియో సీడీలను మల్టీడైమన్షన్ వాసు, రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా....
శ్రీవాస్ మాట్లాడుతూ సాంగ్స్ పిక్చరైజేషన్ రిచ్ గా ఉంది. కమర్షియల్ సినిమాకున్న అన్నీ వాల్యూస్ ఉన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించి యూనిట్ కు మంచి పేరు తీసుకురావాలి. `కన్నడంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ ను సాధించాలి`` అన్నారు.
దర్శకుడు, సంగీత దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ 1970-96 పీరియడ్ లో, ఆదోనిలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నాను. చిన్న సినిమాగా స్టార్ట్ చేస్తే మంచి కథ ఉండటం, అందరి సపోర్ట్ తో పెద్ద సినిమాగా రూపొందింది. కన్నడంలో శుక్రవారం ఈ సినిమాతో పాటు ఐదు సినిమాలు విడుదలైతే మా సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. రెండున్నరేళ్ళు కష్టపడి తీసిన సినిమా. మంగమూరి శేషగిరి రావు, సంధ్యారవి సహా పాతికమందికి దాకా నాకు అండగా నిలబడ్డారు. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ `టీం వర్క్ తో చేసిన సినిమా. రీసెంట్ గా కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలి`` అన్నారు.
ముప్పలనేని శివ మాట్లాడుతూ . మాస్, క్లాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సంధ్యా రవి మాట్లాడుతూ `దర్శకుడు, హీరో సహా అందరూ ఉన్న కమిట్ మెంట్ చూసి నేను సపోర్ట్ చేశాను. సినిమాకు అండగా నిలబడ్డ అందరికీ థాంక్స్ ` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com