18న దండకారణ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
మన దేశంలో దాదాపు 12, 13 రాష్ట్రాలను ఆనుకుని ఉన్న ప్రాంతానికి దండకారణ్యం అని పేరు. అక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆదివాసులు తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే మారణహోమాల్లో ప్రమిదలవుతున్నారు. నిజానికి రాజ్యాంగం ఈ ఆదివాసులకు రాజ్యాంగంలో 5, 6 షెడ్యూళ్ళ ద్వారా భద్రత కల్పించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అంశాలను తుంగలో తొక్కి యథేచ్చగా వారి కార్యకలాపాలను సాగిస్తున్నారు.
ఈ విషయాలను ప్రశ్నిస్తూ ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన సినిమా దండకారణ్యం. స్నేహ చిత్ర పతాకంపై ఆయన తెరకెక్కించిన 29వ సినిమా ఇది. ఆయనే స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తయ్యాయని, ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చిందని, ప్రజాకవులు చాలా బాగా రాశారని, గద్దర్, వందేమాతరం శ్రీనివాస్ చక్కగా ఆలపించారని ఆయన చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com