'ద‌మ్ముంటే సొమ్మేరా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తమిళ్ రూపొందిన  'దిల్లుడు దుడ్డు' చిత్రాన్ని  'ద‌మ్ముంటే సొమ్మేరా' టైటిల్‌తో తెలుగులో అనువాదం చేశారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై న‌ట‌రాజ్ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు. ఇటివల సెన్సార్ కార్యక్రమాలను పుర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత నటరాజ్ మాట్లాడుతూ:   నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఇటివల విడుదల చేసిన మా 'ద‌మ్ముంటే సొమ్మేరా'  ట్రైల‌ర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సామాజిక మాధ్యామాలలో ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి మాకు చాలా ఆనందంగా వుంది.సంతానం మంచి న‌టుడు. ఆయ‌నకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది.యస్ యస్ ధమన్ సంగీతం మరియు బ్యాగ్రౌండ్ స్కొర్ సినిమాకి హైలైట్. సినిమా లొని ప్రతి ఫ్రేం కూడా ఎంతో అందంగా తీర్చి దిద్దాడు సినిమాటోగ్రాఫర్ దీపక్ కుమార్ పత్తి.  పైగా  త‌మిళంలో పెద్ద నిర్మాణ సంస్థ చేసిన ఈ సినిమా ను  శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ ద్వారా మేము రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది.ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు పుర్తి అయ్యాయి.యు/ఏ సర్టిఫికెట్ పొందింది.తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి సుపర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది అని అన్నారు.

శ్రీ కృష్ణా  ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ న‌ర‌సింహారెడ్డి మాట్లాడుతూ  ''ఏప్రిల్ చివరి  వారంలో 'ద‌మ్ముంటే సొమ్మేరా' సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. త‌ప్ప‌కుండా సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది'' అన్నారు. 

More News

న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా 'బేవ‌ర్స్ ' చిత్రం మెద‌టి సాంగ్ లాంచ్

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్నిసొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

'శంభో శంక‌ర' డ‌బ్బింగ్ ప్రారంభం

శంక‌ర్ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌క‌త్వంలో ఎస్. కె. పిక్చ‌ర్స్ సమ‌ర్ప‌ణ‌లో ఆర్.ఆర్ . పిక్చ‌ర్స్ సంస్థ

ఏప్రిల్ 13న 'నా పేరు సూర్య' 3rd సింగిల్ విడుద‌ల‌

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా".

'రంగ‌స్థ‌లం' స‌క్సెస్ మీట్ తేది ఖ‌రారు...

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ‌ఛరణ్ పెర్ఫామెన్స్‌.. సుకుమార్ టేకింగ్‌.. స‌మంత న‌ట‌న‌, దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇలా ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారంతో రూపొందిన చిత్రం 'రంగ‌స్థ‌లం'.

'భ‌ర‌త్ అనే నేను' ..ఆ సీన్స్ ఎంతో కీలకం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’.