Dallas:అమెరికాలో హైటెక్ వ్యభిచారం.. స్ట్రింగ్ ఆపరేషన్‌లో తీగ లాగిన డల్లాస్ పోలీసులు, నిందితుల్లో ప్రముఖ తెలుగు వ్యక్తి
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికాలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న సెక్స్ రాకెట్‌ను అక్కడి పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఓ ప్రముఖ తెలుగు వ్యక్తితో పాటు మొత్తం 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఈ ఘటన జరిగింది. షార్ట్ టర్మ్ రెంటల్ పేరిట అద్దె ఇల్లు తీసుకుని రెండు వెబ్‌సైట్ల ద్వారా ఈ దందాను నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల స్ట్రింగ్ ఆపరేషన్‌లో తేలింది. దాదాపు నాలుగు నెలల నుంచి వ్యభిచారం జరుగుతున్నా..కనీసం పక్క వున్న వారికి కూడా డౌట్ రాకుండా నిర్వాహకులు దందా నిర్వహిస్తున్నారు. అయితే తరచుగా కొత్త వ్యక్తులు కనిపిస్తూ వుండటంతో చుట్టుపక్కల ప్రజలకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అరెస్ట్ అయిన వారిలో తెలుగు వ్యక్తి:
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా మొత్తం తీగ లాగారు. ఈ వ్యభిచార ముఠాలో పట్టుబడిన వారిలో తెలుగు వ్యక్తి రామ్ యార్లగడ్డ అనే ప్రముఖుడు వున్నట్లు సమాచారం. డల్లాస్ పోలీసులు జూలైలో షార్ట్ టెర్మ్ రెంటల్స్‌పై గురి పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వెంటనే సెప్టెంబర్‌లో పాల్మాస్ లేన్‌లోని షార్ట్ టర్మ్ రెంటల్ హౌస్ నుంచి ఫర్నీచర్‌ను వ్యభిచార గృహానికి తరలిస్తుండగా దీనికి సంబంధించిన ఫోటోలను సంపాదించారు పోలీసులు.
నిందితులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ :
ఆ సమయంలో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. ఇది జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత గురువారం నాడు డల్లాస్ పోలీసులు 23 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వీరంతా 27 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న పురుషులుగా తెలిపారు. ఈ ఘటనపై డల్లాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన సార్జెంట్ వారెన్ మిచెల్ మాట్లాడుతూ.. ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం వుందని తెలిపారు. అలాగే మూడు తుపాకులు, 6 వేల డాలర్ల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అరెస్ట్ అయిన 23 మందికి రాష్ట్ర చట్టాల ప్రకారం ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుంది.
గతంలో టాలీవుడ్‌ను కుదిపేసిన సెక్స్ రాకెట్ :
ఇదిలావుండగా మూడేళ్ల క్రితం అమెరికాలో వ్యభిచారం రాకెట్ తెలుగు చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కొందరు హీరోయిన్లతో పాటు స్టార్ యాంకర్ల పేర్లు కూడా బయటపడ్డాయి. అయితే కొందరు తమను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని హీరోయిన్లు , యాంకర్లు వాపోయారు. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి చికాగోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సమర్పించిన 42 పేజీల చార్జిషీట్‌లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments