వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై దళితులు తిరుగుబాటు

  • IndiaGlitz, [Tuesday,April 02 2024]

ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా అనంతబాబు కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో పర్యటించారు. ఈ ప్రచారంలో కాకినాడ లోక్‌సభ అభ్యర్థి సునీల్ కూడా పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం దళితవాడలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. అదే ప్రాంగణం నుంచి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

దీంతో దళితుడ్ని చంపిన నువ్వు అంబేద్కర్‌కు దండేయడానికి సిగ్గులేదా అంటూ అనంతబాబును దళితులు నిలదీశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇక చేసేదేమీ లేక వరుపుల సుబ్బారావు, చలమశెట్టి సునీల్ కలిసి అనంతబాబును కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. లేదంటే పరిస్థితి చేయి దాటిపోయింది. అనంతరం దళితుడిని చంపిన అనంతబాబు దండవేయడంతో అంబేద్కర్ విగ్రహం అపవిత్రం అయ్యిందంటూ అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు, దళితులని చంపి, డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ అనంతబాబుని, దళితులు తరిమి తరిమి కొట్టారు. ప్రత్తిపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయటానికి ప్రయత్నించిన వైసీపీ డాన్ అనంతబాబుని, దళితులు ఊరి బయట వరకు తరిమి కొట్టడంతో అక్కడ నుంచి పారిపోయాడు. జగన్ రెడ్డి గుర్తుంచుకో.. నీ పతనం చూసేది ఈ దళితులే. అని పేర్కొంది.

కాగా తన దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేసే దళితుడు సుబ్రహ్మణ్యంను చంపేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఆయనను అరెస్ట్ చేయడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో ఆయన కొన్ని రోజులు జైలులో ఉండారు. అనంతరం కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కార్యాలయం ప్రకటించింది. అయినా కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

More News

Mahabubnagar MLC: కోడ్ ఎఫెక్ట్.. మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా..

తెలంగాణలో ఇటీవల జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను

Phone Tapping Case: మాజీ డీసీపీ రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Janasena: జనసేనలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు.. అక్కడి నుంచి పోటీ ఖాయం..

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని టీడీపీ నేతలు జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది.

నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ఉత్తమ్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసిందని అప్పటి ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులుచేస్తున్నారు.

Chiranjeevi: 'చూసుకోరు వెధవలు'.. రామ్‌చరణ్‌పై చిరంజీవి వ్యాఖ్యలు వైరల్..

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఏర్పాటుచేసిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డే వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు