వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై దళితులు తిరుగుబాటు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా అనంతబాబు కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో పర్యటించారు. ఈ ప్రచారంలో కాకినాడ లోక్‌సభ అభ్యర్థి సునీల్ కూడా పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం దళితవాడలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. అదే ప్రాంగణం నుంచి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
దీంతో దళితుడ్ని చంపిన నువ్వు అంబేద్కర్‌కు దండేయడానికి సిగ్గులేదా అంటూ అనంతబాబును దళితులు నిలదీశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇక చేసేదేమీ లేక వరుపుల సుబ్బారావు, చలమశెట్టి సునీల్ కలిసి అనంతబాబును కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. లేదంటే పరిస్థితి చేయి దాటిపోయింది. అనంతరం దళితుడిని చంపిన అనంతబాబు దండవేయడంతో అంబేద్కర్ విగ్రహం అపవిత్రం అయ్యిందంటూ అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. "జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు, దళితులని చంపి, డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ అనంతబాబుని, దళితులు తరిమి తరిమి కొట్టారు. ప్రత్తిపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయటానికి ప్రయత్నించిన వైసీపీ డాన్ అనంతబాబుని, దళితులు ఊరి బయట వరకు తరిమి కొట్టడంతో అక్కడ నుంచి పారిపోయాడు. జగన్ రెడ్డి గుర్తుంచుకో.. నీ పతనం చూసేది ఈ దళితులే." అని పేర్కొంది.
కాగా తన దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేసే దళితుడు సుబ్రహ్మణ్యంను చంపేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఆయనను అరెస్ట్ చేయడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో ఆయన కొన్ని రోజులు జైలులో ఉండారు. అనంతరం కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కార్యాలయం ప్రకటించింది. అయినా కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com