వాళ్లు దొంగనాకొడుకులు అంటూ ఫైరైన రానా..
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ - రీతువర్మ జంటగా నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం పెళ్లిచూపులు. సురేష్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లిచూపులు విమర్శకుల ప్రశంసలు అందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా దగ్గుబాటి రానా మాట్లాడుతూ...పెళ్లిచూపులు సినిమా చూసాను చాలా బాగుంది. సినిమా చూస్తుంటే ఈ సినిమాలో ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో నేను ఒకడిగా ఫీలయ్యాను. అంతలా ఈ సినిమాతో కనెక్ట్ అయ్యాను. సింక్ సౌండ్ తో ఈ సినిమాని కొత్తగా చాలా బాగా తీసారు. న్యూ టాలెంట్ ని ప్రొత్సహించిన ఈ చిత్ర నిర్మాతలకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
ఈ చిత్రాన్ని చూడకపోతే మీరు ఏదో మిస్ అయినట్టే. అందుచేత ఈ చిత్రాన్ని అందరూ చూసి మరింత విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఇక పైరసీ గురించి చెప్పాలంటే...మనం ఎంత చెప్పినా పైరసీ చేసే వాళ్లు చేస్తునే ఉన్నారు. నా దృష్టిలో పైరసీ చేసే వాళ్లు దొంగనాకొడుకులు అంటూ తనదైన శైలిలో ఆవేదనను వ్యక్తం చేసారు రానా. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టేలా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికను సిద్దం చేస్తుంది. మరి...ప్రభుత్వ చొరవతోనైనా పైరసీ ఆగుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com