BJP: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు : ఏపీకీ పురంధేశ్వరి.. తెలంగాణకు కిషన్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రాల అసెంబ్లీ ఎననికలు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో వుంచుకుని బీజేపీ అధిష్టానం కీలక మార్పులు చేసింది. పలు రాష్టరాల అధ్యక్షులను మార్చడంతో పాటు కీలక బాధ్యతల్లో కొత్తవారిని నియమించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వున్న సోము వీర్రాజును తప్పించి.. ఆయన స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. ఆ కాసేపటికే ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. దీనితో పాటు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.
పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు :
ఏపీ , తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను అధిష్టానం మార్చింది. ఝార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కర్‌ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
అయితే.. కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్ నేత ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సేవలందించారు . గత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీ కేబినెట్‌లో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇక టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత సీఎం ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎంపీగా గెలిచి.. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments