వైసీపీకి ఊహించని షాక్.. గుడ్ బై చెప్పిన ‘దగ్గుబాటి’

  • IndiaGlitz, [Monday,October 28 2019]

ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు చివరికి రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని గుడ్ బై చెప్పేశారు. అయితే ఈ రాజీనామా వ్యవహారం జరిగి సరిగ్గా 24 గంటలు గడువక ముందే అధికార పార్టీ అయిన వైసీపికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పేయడం గమనార్హం. టీడీపీకి షాక్ తగిలిన 24 గంటల్లోనే అధికార పార్టీ అయిన వైసీపీకి ఊహించని షాక్ తగిలింది.

భార్య వెంటే దగ్గుబాటి!
ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. భార్య పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగడానికే దగ్గుబాటి మొగ్గు చూపారు. వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన రామనాథం బాబును పార్టీలోకి తీసుకోవడంపై తనకు కనీస సమాచారం కూడా లేదని దగ్గుబాటి ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. దగ్గుబాటితో ఆయన కుమారుడు హితేష్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా విషయంలో ఎవరినీ ప్రత్యేకంగా కలవబోమని దగ్గుబాటి చెప్పేశారు. వైసీపీ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసిన దగ్గుబాటి పూర్తి వివరాలు వెల్లడించారు.

ఏం చేయబోతున్నారు..!?
కాగా.. పురంధేశ్వరిని కూడా పార్టీలోకి తీసుకురావాలని.. అవసరమైతే ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని దగ్గుబాటిని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు గత కొన్ని రోజులు వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో వైసీపీలోనే కొనసాగాలా..? బీజేపీకి దగ్గరగా ఉండాలా..? అనేదానిపై కుటుంబీకులు, ముఖ్య అనుచరులతో చర్చించిన అనంతరం దగ్గుబాటి కీలక నిర్ణయమే తీసుకున్నారు. కాగా దగ్గుబాటి వ్యవహారం గత వారం రోజులుగా ఇటు ప్రకాశం జిల్లాలో.. అటు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ఈ వ్యవహారంపై ఒకట్రెండు సార్లు అభిమానులు, ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో దగ్గుబాటి సమావేశమై అనంతరం దగ్గుబాటి వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుని రాజీనామా చేసేశారు. అయితే రాజీనామా చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటుందా లేకుంటే మిన్నకుండిపోతుందా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ రాజీనామాపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి పురంధేశ్వరి ఈ వైసీపీ వివాదంపై ఎలా స్పందిస్తారో.. వెయిట్ అండ్ సీ.

More News

రీషూట్‌లో 'RRR'

టాలీవుడ్‌లో రూపొందుతున్న మ‌రో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `RRR`. `బాహుబ‌లి` త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో

ఓవర్ నైట్లో ఆర్టీసీ విలీనం ఎలా..? రేపు తేల్చేస్తామన్న హైకోర్టు!

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సోమవారం నాడు హైకోర్టులో సుధీర్ఘ విచారణ జరిగింది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.

ప‌వ‌న్ కోసం జాన‌ప‌ద సినిమా?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజకీయాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాల్లో మ‌ళ్లీ న‌టిస్తారంటూ కొన్ని రోజులుగా వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'మీకు మాత్రమే చెప్తా'

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ "కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్" పతాకంపై రూపొందిన సినిమా "మీకు మాత్రమే చెప్తా" .

సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్న'డిస్కో రాజా'

మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు,