వైసీపీ లో చేరిన దగ్గుపాటి, ఆమంచి

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుపాటి హితేశ్ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదివరకే దగ్గుపాటి ఫ్యామిలీ, ఆమంచి వైఎస్ జగన్‌‌తో భేటీ కాగా ఇవాళ అధికారికంగా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలోని వైసీపీ నూతన కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు వారి పదవికి రాజీనామాలు చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.