Daggubati Abhiram:ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్.. ఫొటోలు వైరల్..

  • IndiaGlitz, [Thursday,December 07 2023]

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరో యువ హీరో ఓ ఇంటి వాడయ్యాడు. దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఆ హీరో వివాహం ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా జరిగింది. అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్.. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను పెళ్లి చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో బంధువులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వివాహం శ్రీలంకలోని ఓ రిసార్ట్‌లో జరిగింది.

డిసెంబర్ 6వ తేదీ బుధవారం రాత్రి 8.50 గంటలకు అభిరామ్, ప్రత్యూషల వివాహం జరిగినట్లు చెబుతున్నారు. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకులు జరిగాయట. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నారు. దగ్గుబాటి కుటుంబం భారత్ తిరిగి వచ్చాక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే.

కాగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన ‘అహింస’ సినిమాతో అభిరామ్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైన సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే కొత్త సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

More News

Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ముందుగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.

Chandrababu:బీజేపీకి భయపడిన చంద్రబాబు.. ప్లేటు ఫిరాయింపు..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Chief Minister of Telangana:రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ రేవంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు.

Pragati Bhavan:ప్రగతి భవన్ కంచెలు బద్దలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత..

ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. అక్కడ ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు పూర్తి ఎత్తివేశారు.

Revanth:పెద్దమ్మతల్లిని దర్శించుకుని ఎల్బీ స్టేడియానికి రేవంత్..

మరికాసేపట్లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.