Daggubati Abhiram:ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్.. ఫొటోలు వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరో యువ హీరో ఓ ఇంటి వాడయ్యాడు. దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఆ హీరో వివాహం ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా జరిగింది. అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్.. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను పెళ్లి చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో బంధువులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వివాహం శ్రీలంకలోని ఓ రిసార్ట్‌లో జరిగింది.
డిసెంబర్ 6వ తేదీ బుధవారం రాత్రి 8.50 గంటలకు అభిరామ్, ప్రత్యూషల వివాహం జరిగినట్లు చెబుతున్నారు. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకులు జరిగాయట. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నారు. దగ్గుబాటి కుటుంబం భారత్ తిరిగి వచ్చాక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే.
కాగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన ‘అహింస’ సినిమాతో అభిరామ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైన సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే కొత్త సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com