తాతయ్య ఉండుంటే నేనెప్పుడో హీరో..!

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు, దర్శకనిర్మాతలు లెజండరీ నిర్మాతను గుర్తు చేసుకున్నారు. ఈయన ఇండస్ట్రీకి చాలా మంది నటీనటులను పరిచయం చేశాడన్న విషయం విదితమే. వాణి శ్రీ, హరీష్‌, మాలాశ్రీ, ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌, టబు, ఆర్తి అగర్వాల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి రామానాయుడు లైఫ్ ఇచ్చారు. ఈయనకు సినీ ఇండస్ట్రీనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు. తాత జయంతి సందర్భంగా కార్యక్రమంలో దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మిస్ యూ తాత..!

‘తాతయ్య రామానాయుడు బతికుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఆయన ఉండుంటే నేను ఎప్పుడో హీరో అయ్యేవాడిని. నాకు ఎంతో సపోర్ట్ ఉండేది. నేను తాతను ఎంతో మిస్ అవుతున్నాను. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ... మానసికంగా ఆయన నాకు దగ్గరగా ఉన్నారనేది నా ఫీలింగ్. తాత ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఒకింత భావోద్వేగానికి లోనవుతూ అభిరామ్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. కార్యక్రమంలో అభిరామ్ పక్కనే ఉన్న ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. ‘ఏం భయపడొద్దులే అభిరామ్.. నువ్ హీరో అయిపోతావ్ లే..’ అని అభిరామ్ భుజం తట్టారు సి. కళ్యాణ్. కాగా ఈ ఇద్దరి మధ్య ఈ జరిగిన సన్నివేశం ఈ కార్యక్రమానికి హైలైట్ అయ్యింది. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సినీ పెద్దల భేటీ గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు.

More News

పేద విద్యార్థులకు జగన్ సర్కార్ ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే ప్రజలు.. మరీ ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

మీరా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ 15 మంది త్వరలో అరెస్ట్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రామానాయుడు సేవలు చిరస్మరణీయం : చంద్రబాబు

జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు,

జగన్‌తో భేటీకి రానని చెప్పేసిన బాలయ్య.. నిజమేనా!?

టాలీవుడ్ పెద్దలు జూన్-09న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కాబోతోన్నారు. ఈ భేటీలో పలువురు దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ హాజరుకానున్నారు.

ఏపీలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 161 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా బీభత్సం సృష్టిస్తోంది. మే నెల మొత్తం తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. అయితే జూన్ ప్రారంభం నుంచి మాత్రం పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.