శిరీష్‌కు గిఫ్ట్ ఇచ్చిన అరవింద్
- IndiaGlitz, [Tuesday,October 11 2016]
అల్లు అరవింద్ పెద్ద తనయుడు అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బన్ని తమ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల గౌరవం, కొత్త జంట చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. అయితే శిరీష్ రీసెంట్‌గా చేసిన శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మంచి సక్సెస్‌ను సాధించాడు.
ఈ సక్సెస్ పట్ల శిరీష్ కంటే తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడట. అందుకే శిరీష్ ఆడి క్యూ 7 కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. శిరీష్‌కు అల్లు అరవింద్, బన్ని కారును బహుమతిగా ఇచ్చే ఫోటోను కూడా పోస్ట్ చేయడం విశేషం.