కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్
- IndiaGlitz, [Monday,April 24 2017]
కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు అరుదైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు దక్కింది. తనదైన చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన కె.విశ్వనాథ్‌ను 2016 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 1957లో తోడికోడళ్ళు సినిమాతో సౌండ్ ఇంజనీరింగ్ విభాగంలో చేరి కెరీర్‌ను స్టార్ట్ చేసిన కె.విశ్వనాథ్ ఆత్మగౌరవంతో దర్శకుడిగా మారారు.
సిరి సిరి మువ్వ, శంకరాభరణం, స్వర్ణకమలం, స్వాతిముత్యం, స్వాతి కిరణం, శృతిలయలు, సాగర సంగమం ఇలాంటి ఎన్నో కలికితురాళ్ళ సినిమాల రూపంలో కె.విశ్వనాథ్ అందించారు. భారతీయ సినిమాకు విశ్వనాథ్ చేసిన సేవకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా కె.విశ్వనాథ్ దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోనున్నారు.