'దబాంగ్ 3' ప్రారంభమైంది

  • IndiaGlitz, [Monday,April 01 2019]

సల్మాన్‌ఖాన్ కెరీర్‌లోని పెద్ద హిట్ సినిమాల్లో ఒకటైన ‘దబాంగ్’ చిత్రం సీక్వెల్ ‘దబాంగ్ 3’ షూటింగ్ ఆదివారం ఇండోర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవాతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సినిమా విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తొలి షాట్‌కి క్లాప్ నిచ్చారు. ఈ సినిమా కోసం సల్లూభాయ్ బాగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగా వీరి తాతగారు పోలీసుగా పని చేసిన ఆయా ప్రాంతాలను చుట్టిరానున్నారు.

ఈ మధ్యే ‘దబాంగ్ 3’ కోసం సల్మాన్ ఏస్ కొరియాగ్రాఫర్ సరోజ్‌ఖాన్‌ని? కలిశారు. 2010లో అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో ‘దబాంగ్’ చిత్రం రాగా అది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన అర్బజ్‌ఖాన్ దానికి సీక్వెల్‌గా ‘దబాంగ్ 2’ తీశాడు. అది కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. మరి ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రంతో రికార్డులు బద్దలు కొడతాడేమో చూడాలి. ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.

More News

'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' మా జీవితాలను మార్చేసింది- టీమ్

శ్రీతేజ్, విజ‌య్‌కుమార్‌, య‌జ్ఞాశెట్టి,  త‌దిత‌రులు న‌టించిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. రాంగోపాల్ వ‌ర్మ, అగ‌స్త్య మంజు ద‌ర్శ‌కులు. జి.వి ఫిలింస్ సమర్పణలో

వ‌రుణ్ చిత్రంలో డ‌బ్ స్మాష్ న‌టి

ఈ సంక్రాంతికి 'ఎఫ్ 2'తో స‌క్సెస్ అందుకున్న హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు. త‌దుప‌రి చిత్రంలో వ‌రుణ్ 'వాల్మీకి' చేస్తున్నాడు. ఇది త‌మిళ చిత్రం 'జిగ‌ర్ తండా'కు రీమేక్‌.

అఖిల్ కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ.. మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది.

'Mr ప్రేమికుడు' ఫ‌స్ట్ లుక్ లాంచ్‌

ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్క‌గ‌ల్రాని హీరో హీరోయిన్లుగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  త‌మిళ చిత్రం 'చార్లీ చాప్లిన్'.  ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకం

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌ల్యాణ్ రామ్‌

రీసెంట్‌గా విడుద‌లైన `118`తో స‌క్సెస్ అందుకున్నాడు హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.