Daadi Veerabhadra Rao: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్.. దాడి వీరభద్రరావు రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమయంలో వైసీపీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. నాయకులు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao), ఆయన కుమారుడు దాడి రత్నాకర్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాను, తన కుమారుడు పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు పార్టీ అధినేత జగన్(Jagan)తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డికి లేఖ పంపించారు. అయితే ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం లేఖ పంపించకపోవడం గమనార్హం.
రాజీనామా అనంతరం ఆయన కుమారుడు రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రేపు చంద్రబాబు(Chandrbabu)తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. కాగా 2014కు ముందు వరకు దాడి వీరభద్రరావు టీడీపీలోనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల 2014లో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో దాడి రత్నాకర్‌కు విశాఖ వెస్ట్ టికెట్ ఇవ్వగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్‌ను ఆశించగా అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలతో చర్చించి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దాడి వీరభద్రరావు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల వేళ అందరూ సీట్లు, టికెట్లు ఆశించడం సహజమని.. అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. టికెట్ ఇవ్వలేకపోయినా మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పినా ఆయన వినలేదన్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా తమ పార్టీకి వచ్చే నష్టం లేదని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థుల మార్పు అంశం నేపథ్యంలో కీలక నేతలందరూ వరుసగా రాజీనామా చేయడం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎప్పుడు ఎవరూ పార్టీని వీడతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరి అసంతృప్తులకు పార్టీ అధినేత జగన్ ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments