Daadi Veerabhadra Rao: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్‌ షాక్.. దాడి వీరభద్రరావు రాజీనామా..

  • IndiaGlitz, [Tuesday,January 02 2024]

ఎన్నికల సమయంలో వైసీపీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. నాయకులు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao), ఆయన కుమారుడు దాడి రత్నాకర్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాను, తన కుమారుడు పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు పార్టీ అధినేత జగన్‌(Jagan)తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డికి లేఖ పంపించారు. అయితే ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం లేఖ పంపించకపోవడం గమనార్హం.

రాజీనామా అనంతరం ఆయన కుమారుడు రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రేపు చంద్రబాబు(Chandrbabu)తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. కాగా 2014కు ముందు వరకు దాడి వీరభద్రరావు టీడీపీలోనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల 2014లో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో దాడి రత్నాకర్‌కు విశాఖ వెస్ట్ టికెట్ ఇవ్వగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్‌ను ఆశించగా అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలతో చర్చించి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

దాడి వీరభద్రరావు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల వేళ అందరూ సీట్లు, టికెట్లు ఆశించడం సహజమని.. అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. టికెట్ ఇవ్వలేకపోయినా మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పినా ఆయన వినలేదన్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా తమ పార్టీకి వచ్చే నష్టం లేదని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థుల మార్పు అంశం నేపథ్యంలో కీలక నేతలందరూ వరుసగా రాజీనామా చేయడం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎప్పుడు ఎవరూ పార్టీని వీడతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరి అసంతృప్తులకు పార్టీ అధినేత జగన్ ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి.

More News

అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వం వార్నింగ్.. సమ్మె విరమించకపోతే..?

ఏపీలో కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్ల(Anganwadi Workers)కు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని..లేకుంటే శాఖాపరమైన చర్యలు

అయోధ్య రామ్ లల్లా విగ్రహం ఎంపిక ఖరారు.. ఎవరు చెక్కారంటే..?

అయోధ్య(Ayodhya) రామాలయంలో కొలువుదీరనున్న 'రామ్ లల్లా'(Ram Lalla) విగ్రహం ఎంపిక ఖరారైంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని గర్భ గుడిలో

YSRCP: వైసీపీలో పెరుగుతున్న ధిక్కార స్వరాలు.. పార్టీకి మైనస్ కానున్నాయా..?

ఎమ్మెల్యేల మార్పు అంశం వైసీపీలో రోజురోజుకు తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ఎప్పుడూ ఏ నేత పార్టీ మారతారో.. ఎవరూ పార్టీపై ధిక్కార వ్యాఖ్యలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

YS Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల పార్టీ విలీనం ఖాయం.. ముహూర్తం ఎప్పుడంటే..?

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైయస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌టీపీ భేటీలో షర్మిల కీలక ప్రకటన చేశారు.

పెట్రోల్ బంకులకు ఒక్కసారిగా పోటెత్తిన ప్రజలు.. ఎందుకంటే..?

కొన్ని రోజులు పాటు పెట్రోల్, డీజిల్ దొరకదా..? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశ ప్రజలను భయపెట్టిస్తోంది. అందుకే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు ముందు వాహనదారులు బారులు తీరారు.