Andhra:కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాన్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు..

  • IndiaGlitz, [Saturday,December 02 2023]

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని పేర్కొన్నారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తాయంది. దీంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. ఉత్రరాంధ్ర, రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయింది.

సోమవారం పశ్చిమ గోదావరి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీ పొట్టిశ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామని.. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు వివరించారు.

ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నెంబర్లు 1070, 112, 18004250101కు ఫోన్ చేయాలన్నారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారలు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు త్వరగా తీరానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

More News

Nagarjunasagar Dam:కేంద్రం ఆధీనంలోకి నాగార్జునసాగర్ డ్యామ్.. CRPF బలగాలు మోహరింపు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిప్పు రాజేసిన నీటివివాదం కేంద్రం జోక్యంతో చల్లబడింది.

Salaar Trailer: ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్... 'సలార్' ట్రైలర్... ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 'సలార్ పార్ట్ 1' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Police Son:పోలీస్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి..

అతివేగం అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకం అని పోలీసులు తరుచూ ప్రకటనలు చేస్తూనే ఉంటారు.

Pawan Kalyan:ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడే పోరాటం చేశా: పవన్ కల్యాణ్‌

జనసేనకు యువతే పెద్ద బలమని.. రాష్ట్రంలో ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందని జనసేనాని పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Krishna Board:తక్షణమే సాగర్ నీటి విడుదల ఆపండి.. ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు..

నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది.