'చావు కబురు చల్లగా'కు ఝలక్ ఇచ్చిన పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బన్నీవాసు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భర్తను కోల్పోయిన యువతిని చూసి ఇష్టపడి కార్తీక్ ఎలా ఆమెను వివాహం చేసుకున్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కాన్సెప్ట్‌లో కొ్త్తదనం ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జోక్స్, బిజోయ్ సంగీతం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.
బస్తీ బాలరాజుగా కార్తికేయ బాగానే అలరించాడు. అయితే తాజాగా కార్తికేయకు ఈ సినిమా విషయంలో సైబరాబాద్ పోలీసులు మంచి ఝలక్ ఇచ్చారు. కార్తికేయ బైక్‌పై లావణ్యను ఎక్కించుకుని పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని బైక్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఒక్క పోలీసులను తప్ప. దీనికి కారణం.. కార్తికేయకు హెల్మెట్ లేకపోవడం. ఇది చూసిన సైబరాబాద్ పోలీసులు ఈ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి సరదా కామెంట్ ఒకటి పెట్టారు. ‘హెల్మెట్లు పెట్టుకుని.. సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు’ అంటూ సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments