చిరంజీవి అల్లుడికి సైబర్ వేధింపులు
- IndiaGlitz, [Wednesday,June 12 2019]
.
మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ దేవ్‌కు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. వివరాల్లోకెళ్తే.. ఐదు రోజుల క్రితం ఐదారుగురు ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ను క్రియేట్ చేసుకుని కల్యాణ్ దేవ్‌ను టార్గెట్ చేశారు. కల్యాణ్ దేవ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తూ పోస్టులు చేశారు.
దీంతో కల్యాణ్ దేవ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసును పరిశీలించిన పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా
ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసులు లేఖ కూడా రాశారు. వారి నుండి సదరు ఐడీలకు సంబంధించిన వివరాలు రాగానే చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపారు.