ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి..

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

ఎయిర్ ఇండియాతో స‌హా ప‌లు అంత‌ర్జాతీయ విమానయాన సంస్థ‌ల‌పై భారీ సైబ‌ర్ దాడి జ‌రిగింది. ప్రయాణికుల సేవల వ్యవస్థను అందిస్తున్న ‘ఎస్‌ఐటీఏ’పై ఫిబ్రవరిలో సైబర్‌ దాడులు జరగాయి. దీంతో కొంత మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్‌ అయినట్లు శుక్రవారం ఎయిర్ ఇండియా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఆయా సంస్థ‌ల‌కు చెందిన 45 ల‌క్ష‌ల మంది యూజ‌ర్ల డేటా లీకైంది. ఎస్ఐటీఏ పీఎస్ఎస్ స‌ర్వ‌ర్‌లో విమాన ప్ర‌యాణికుల వ్య‌క్తిగ‌త స‌మాచారం ఉంటుంది. కాగా.. 2011 ఆగ‌స్టు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 20 మ‌ధ్య విమాన ప్ర‌యాణానికి పేర్లు రిజిస్ట‌ర్ చేసుకున్న డేటా లీకైంది.

ఇదీ చదవండి: నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ గుండెపోటుతో మృతి

ఆగస్టు 11, 2011 నుంచి ఫిబ్రవరి 3, 2021 మధ్య నమోదైన వ్యక్తిగత సమాచారంపై ఆ ప్రభావం పడినట్లు ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. స్టార్ అల‌యెన్స్‌తోపాటు ఎయిరిండియా ప్ర‌యాణికుల పేర్లు, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, కాంటాక్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్‌, పాస్‌పోర్ట్ వివ‌రాలు, టిక్కెట్ స‌మాచారం లీక్ అయి ఉండొచ్చున‌ని తెలుస్తోంది. ఇంకా మ‌లేషియా ఎయిర్‌లైన్స్‌, ఫిన్‌నాయ‌ర్‌, సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌, లుఫ్తాన్సా, క‌థాయ్ ప‌సిఫిక్ సంస్థ‌ల డేటా కూడా లీకైనట్టు సమాచారం. తాము, తమ డేటా ప్రాసెసర్‌ కలిసి పరిష్కార చర్యలు చేపడుతూనే ఉన్నామని... ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని కోరుతున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న డేటా లీక్ గురించి తొలుత స‌మాచారం అందుకున్నామ‌ని పేర్కొంది. ఏయే స‌మాచారం లీకైంద‌న్న విష‌య‌మై మార్చి 25-ఏప్రిల్ 5 మ‌ధ్య గుర్తించామ‌ని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిరిండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 45 లక్షల ప్రయాణికుల డేటా లీక్‌ అయినట్లు తెలిపింది. ఎస్‌ఐటీఏ అనేది స్విట్జర్లాండ్‌కు చెందిన కంపెనీ. ఫిబ్రవరి 2021 చివరి వారంలో ఆ సంస్థపై సైబర్‌ దాడి జరిగినట్లు ఎయిరిండియా తెలిపింది. ఏ స్థాయిలో జరిగిందనే అంశంపై ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరుగుతోందని..ఆ దాడి తర్వాత కంపెనీ వ్యవస్థలో ఎటువంటి అనధికార కార్యకలాపాలు జరగలేదని ఎస్‌ఐటీఏ స్పష్టం చేసినట్లు వివరించింది.

More News

ట్విటర్ వెరిఫికేషన్ ఖాతా కోసం ఎదురు చూస్తున్నారా? ఇలా చెయ్యండి

ట్విటర్ వెరిఫికేషన్ ఖాతా కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం అప్లై చేసెయ్యండి. మూడేళ్లుగా నిలిచిపోయిన పబ్లిక్ వెరిఫికేషన్‌‌ కార్యక్రమాన్ని ట్విటర్ తాజాగా ప్రారంభించింది.

తగ్గుముఖం పట్టిన సెకండ్ వేవ్?

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఒక్కసారిగా ఏ రేంజ్‌లో విజృంభించిందో తెలియనిది కాదు. నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవడంతో ఈ పరిస్థితుల నుంచి బయటపడతామా..

50 హాస్పిటల్స్ కి ఫోన్ చేశా.. డాక్టర్ ఆ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ : హంసానందిని

కోవిడ్ 19 చిక్కులు సెలెబ్రెటీలకు సైతం తప్పడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఎందరో ప్రముఖులు కరోనా బారీన పడి ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.

నేటి నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, డీజీపీతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మహేష్ భావోద్వేగం.. గ్రేట్ లాస్ అంటున్న చిరు, ఎన్టీఆర్

ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు ఆకస్మిక మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సీనియర్ హీరోల నుంచి నేటి తరం యంగ్ హీరోల వరకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది.