వాడీవేడిగా సీడబ్ల్యూసీ మీటింగ్.. రాజీనామా చేస్తానన్న గులాంనబీ ఆజాద్..

  • IndiaGlitz, [Monday,August 24 2020]

పార్టీ అధ్యక్ష పదవిపై జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో వాడీవేడి చర్చ జరుగుతోంది. నిజానికి పార్టీ అధ్యక్షుడి ఎంపిక ప్రధానాంశంగా జరుగుతుందని అంతా భావించిన ఈ భేటి.. 23 మంది కీలక నేతలు రాసిన లేఖ ప్రధానాంశంగా జరుగుతోంది. లేఖ రాసిన అసమ్మతి నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు సీడబ్ల్యూసీ మీటింగ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. దీనిపై స్పందించిన గులాం నబీ ఆజాద్ బీజేపీతో జత కలిపి ఈ లేఖ రాసినట్టు నిరూపిస్తే తాను పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తాము లేఖ రాయడానికి సభ్యుల వ్యవహార శైలే కారణమని ఆజాద్ స్పష్టం చేశారు.

మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 30 ఏళ్లుగా బీజేపీకి అనుకూలంగా ఒక్కసారి కూడా మాట్లాడింది లేదన్నారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, మణిపూర్‌లో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ తరుఫున పోరాడామని కపిల్ సిబల్ తెలిపారు. అయినా బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ వ్యాఖ్యానించడం పట్ల ఆయన ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కపిల్ సిబల్ ట్వీట్‌పై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్‌లోనే స్పందించారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. అనుమతించబోరని వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే అపోహలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. మోదీ పాలనపై అంతా కలిసి పోరాడాలన్నారు. అయితే రణదీప్ సూర్జేవాలా ఈ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే కపిల్ సిబల్ తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. రాహుల్ ఆ వ్యాఖ్యలు చేయలేదని వ్యక్తిగతంగా తనకు చెప్పినందునే ట్వీట్‌ను డిలీట్ చేసినట్టు కపిల్ సిబల్ వెల్లడించారు.

More News

రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన నల్గొండ కోర్టు...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నల్గొండ ఎస్పీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది.

అదంతా పుకారు.. ఇంకా నాన్నగారు లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన అబద్ధమని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు.

అధ్యక్షురాలిగా కొనసాగలేనన్న సోనియా... లేఖపై రాహుల్ ఫైర్..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 48 మంది సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, సినీ ఇండస్ట్రీ చేసిన ప్రార్థనలు ఫలించాయి.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. వారానికి 4 లక్షల చొప్పున పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్రత భారీగా పెరిగిందన్నారు.