రేపు సీడబ్ల్యూసీ కీలక భేటీ.. సోనియా రాజీనామా?

కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా.. 2019లో తిరిగి ఆయన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి ముఖ్య కారణం బలమైన ప్రత్యర్థి లేకపోవడమేనని సర్వత్రా చర్చ జరుగుతోంది. కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పు అత్యవసరంగా మారింది. ఇప్పటికీ మారకుంటే కాంగ్రెస్ పార్టీ దేశంలోనే పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ప్రమాదముంది.

తాజాగా 23 మంది కాంగ్రెస్ నేతలు అధినేత్రి సోనియాగాంధీకి ఇటీవల లేఖ రాశారు. వీరిలో ఆనంద్ శర్మ, శశిథరూర్, గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్ పృధ్వీరాజ్ చవాన్ తదితరులున్నారు. దీనిపై స్పందించిన సోనియా అందరం కలిసి కొత్త అధ్యక్షడిని వెదుకుదామని పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకునేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. మేరకు సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోనియా తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మరోసారి సైతం ఆమెనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు నేతలు కోరినప్పటికీ ఆమె సుముఖంగా లేరని సమాచారం.

ఒకవేళ రేపు జరిగే సమావేశంలో సోనియా రాజీనామా చేస్తే అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై సర్వత్రా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ సైతం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తే గట్టి నిర్ణయాలు తీసుకునే సమర్థుడైన నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు సైతం జరగవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న సీడబ్ల్యూసీ కీలక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More News

అత్త పాత్ర‌లో సిమ్రాన్‌..?

చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేశ్‌, నాగార్జున, మహేశ్‌, ప్ర‌భాస్‌(ఓ సాంగ్‌లో) వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో

సినీ, టీవీ షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ వ్యాప్తంగా సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో నూత‌న‌ చిత్రం ప్రారంభం

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మీడియ‌న్ కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌కునిగా మారారు.

చిరకాల మిత్రుడు పంపిన గిఫ్ట్‌తో ఫోటో తీసుకుని మురిసిపోతున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకో స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. అది తన చిరకాల మిత్రుడు పంపాడని..

గుడ్ న్యూస్ చెప్పిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’.. ఉచితంగా వ్యాక్సిన్..

భారతీయులందరికీ ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు గుడ్ న్యూస్ చెప్పారు.