BJP:జనసేనతో కటీఫ్.. ఒంటరిగానే పోటీకి బీజేపీ మొగ్గు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన పోటాపోటీగా ముందుకు వెళ్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ప్రచారానికి సిద్ధమైంది. అయితే పొత్తులో కాకుండా ఒంటరిగా బరిలో దిగడానికి రెడీ అయింది. ఇప్పటిదాకా జనసేనతో పొత్తులో ఉంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగారు. బీజేపీని కూడా తమతో కలుపుకోవాలని భావించారు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం సింగిల్‌గానే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గురువారం ఒక్కరోజే పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ప్రచార రథాలను కూడా సిద్ధం చేస్తు్న్నారు. బీజేపీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రచారం చేయబోతున్నారు. బీజేపీకీ ‘రాష్ట్రంలో ఒక్క అవకాశం- కేంద్రంలో మరో విడత’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం షురూ చేయనున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్దుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇతర పార్టీల్లోని కీలక నేతలను చేర్చుకుని పోటీకి దింపేలా కార్యాచరణ రూపొందిస్తు్న్నారు. అలాగే సినీ నటులను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
ఇక త్వరలోనే పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. అలాగే 9,10,11 తేదీల్లో 'పల్లెలకు పోదాం' కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థుల కోసం ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. పొత్తులతో సంబంధం లేకుండా అభ్యర్థులను సిద్ధం చేయాలన్న అధిష్టానం ఆదేశాలతో ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
మరోవైపు బీజేపీ నిర్ణయంతో టీడీపీ-జనసేన కూడా తమ కార్యాచరణను సిద్ధం చేస్తు్న్నాయి. ఇప్పటిదాకా తమతో కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ భావించగా.. కమలం పెద్దలు ఇందుకు కాషాయం పెద్దలు సుముఖతగా లేరు. దీంతో తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. రెండు మూడు రోజుల్లో సీట్లు సర్దుబాటు ఫైనల్ చేసి తొలి విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నాలుగో తేదీ లోపు దీనిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చాక ఇక ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. అటు అనకాపల్లి నుంచి పవన్ ఎన్నికల శంఖారాం పూరించనుండగా.. ఇటు చంద్రబాబు 'రా..కదిలిరా' సభలను నిర్వహించనున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగనుండగా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments