మే 3 వరకూ అమెరికా వీసాలకు బ్రేక్..
- IndiaGlitz, [Wednesday,April 28 2021]
కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కీలక ప్రకటన జారీ చేసింది. మే 3 నుంచి అన్ని రకాల రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ తాజాగా ప్రకటించింది. తదుపరి ప్రకటన చేసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అన్ని రకాల నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూ మాఫీ చేసినట్లు హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.
అమెరికా పౌరుల కోసం అన్ని రకాల రోజువారీ సేవల అపాయింట్మెంట్లను ఏప్రిల్ 27 నుంచి రద్దు చేసినట్టు హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ తెలిపింది. అమెరికా పౌరులకు అత్యవసర సేవలు, వీసా అపాయింట్మెంట్లు కొనసాగుతాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం అత్యవసర అపాయింట్మెంట్లను మాత్రం యథాతథంగా జరుపుతామని తెలిపింది. స్థానిక పరిస్థితులు అనుకూలించేంత వరకు సేవలను రద్దు చేస్తున్నట్టు కాన్సులేట్ జనరల్ చెప్పింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ఇది అమల్లో ఉంటుందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.