ఓ వైపు సోదాలు.. మరోవైపు ‘కరెన్సీ’ నోట్ల వర్షం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి భారీ వర్షం.. అతి భారీ వర్షం ఇంకా చేపల వర్షం చూశాం కానీ ఇదేంటి ఎక్కడైనా తుఫాన్ వస్తే కొంపదీసి దానికి ఇలా ‘కరెన్సీ నోట్ల వర్షం’ అని పేరు పెట్టారా..? ఏంటి అని అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే మరి. నిజంగానే మీరు వింటున్నది అక్షర సత్యం కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఇంకా అబ్బే ఇదేదో సినిమాలో అనుకుంటున్నారేమో అదేం కాదండోయ్.. కోల్‌కతాలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఓ భవనంలో చోటుచేసుకున్న ఘటన ఇది. ఇదిగో అసలు విషయం తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు మరి.
అసలేం జరిగింది..!
కోల్‌కతాలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఓ భవనం నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. దీంతో అసలేం జరుగుతోంది..? ఎక్కడ్నుంచి నోట్లు పడుతున్నాయ్..? అనే విషయం తెలియక జనం ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే ఇలా ఆశ్చర్యపోయి ఆలస్యం చేయడమెందుకనీ దొరికినంత ఏరుకుని అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యారు. అసలేం జరుగింది ఆరా తీయగా.. కోల్‌కతాలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఓ భవనం ఓ సంస్థలో డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆ సంస్థ ఎగుమతులు-దిగుమతులకు సంబంధించి వ్యాపారం చేస్తోంది. అయితే ట్యాక్స్ చెల్లించకపోవడంతో డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తుండగా.. వారికి డబ్బులు చిక్కకూడదని ఇలా కిటికీలో నుంచి బయటికి విసిరేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
కాగా కిందపడ్డ నోట్లలో రూ.2000, రూ. 500, రూ. 100 ఉండటం గమనార్హం. ఇలా జనాలు ఆ నోట్లు ఏరుకోవడానికి పెద్ద ఎత్తున గుమిగూడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగింది..? తనిఖీలు చేసిందెవరు..? కరెన్సీ నోట్లకు, సోదాలకు సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments