రాత్రి 7 గంటలు నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్చి-31వరకు లాక్డౌన్ విధించిన కేసీఆర్ సర్కార్.. తాజాగా ప్రజలకు ఒకింత వార్నింగ్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటికి రావడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. ఒకవేళ కాదని బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు.. వాహనాలు రోడ్లపైకి రావొద్దని హెచ్చరించింది. ఐదుగురికి మించి గుమిగూడవద్దని సూచించింది. బయటికి వస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని.. ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఆటోలు పూర్తిగా బంద్ చేయాలని ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.
బయట తిరిగితే క్వారంటైన్కే!
ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ మీడియా ముందుకు పలు విషయాలు షేర్ చేసుకున్నారు. సాయంత్రం 7పైన ఎవరైనా బయట తిరిగితే మాత్రం వాళ్ళను క్వారంటైన్ సెంటర్లకి తరలించాలని పోలీసులకు సీఎస్ సూచించారు. ‘1897 కింద లాక్ డౌన్ అమలు చేస్తున్నాము. లాక్ డౌన్ వల్ల అంతర్ రాష్ట్ర బార్డర్స్ మూసివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు అన్ని బంద్ చేయించాం. ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎక్కడ 5 మంది కంటే గుమిగూడా కూడదు. కొన్ని చోట్ల నిత్యావసర వస్తువుల దగ్గర మాత్రమే అలౌట్ లేదు. జీవో 45 లో ఉన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. పరీక్షలు అన్ని వాయిదా వేస్తున్నాము. రోడ్ మీద ఎక్కడ ఎలాంటి వాహనాలు నడవడానికి వీలు లేదు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలు తప్పవు. గ్రామాల్లో వ్యవసాయ పనులు నడుస్తాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా బయట తిరిగితే పాస్ పోర్ట్‌పై చర్యలు తీసుకుంటాం’ అని సీఎస్ హెచ్చరించారు.
పోలీసుల కంట పడితే సీజ్!
‘ఒక కాలనీలో వెహికిల్‌లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలి. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు. ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు. సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారు. ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడానికి మాత్రమే అనుమతి. మీడియాకు ఎక్కడైనా తిరిగే అనుమతులున్నాయి. చట్టం చాలా కఠినంగా అమలు ప్రభుత్వ అధికారులు చేస్తారు. హింసకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతి బైక్‌పై ఒక వ్యక్తి... ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆటో అసోషియేషన్‌కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాం. యాక్ట్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలి. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. లాక్ డౌన్‌పై ప్రధాని మోదీ-సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు’ అని డీజీపీ మీడియా ముఖంగా తేల్చిచెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments