8 జిల్లాల్లో ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. కొత్త నిబంధనలు ఇవే!
- IndiaGlitz, [Monday,June 28 2021]
సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధలని సడలిస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: ఐఐటీ కాన్పూర్ అధ్యయనం.. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ విధ్వంసమే!
కరోనా పాజిటివిటి రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న 8 జిల్లాలో కర్ఫ్యూని సడలించింది. జులై 1 నుంచి 7 వరకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు 8 జిల్లాలో కర్ఫ్యూ సడలించింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో పాజిటివిటి రేటు 5 శాతం కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే కర్ఫ్యూ సడలించారు. పాజిటివిటి రేటు తగ్గితే ఈ జిల్లాల్లో కూడా కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకుంటారు.
మే నెలలో విలయతాండవం చేసిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం బాగా తగ్గింది. దీనితో జన జీవనం నెమ్మదిగా నార్మల్ గా మారుతోంది. అయితే థర్డ్ వేవ్ భయాందోళనలు మొదలవుతున్నాయి.