హైదరాబాద్ లో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' కీలక సన్నివేశాల చిత్రీకరణ

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈరోజు నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో సినిమా ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. 14 వ తేదీ వరకు ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్ జరుగుతుంది. హోళి సందర్భంగా పోస్టర్ ఇంపాక్ట్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి... ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ... గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈరోజు నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ని అద్భుతమైన లోకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు ముఖ్య తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ నెల 14 వ తేదీ వరకు ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్ జరుగుతుంది. హోళి సందర్భంగా పోస్టర్ ఇంపాక్ట్ ను రిలీజ్ చేశాం. మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

More News

ఈ ఏడాది ఆ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?

గతేడాది..టాలీవుడ్ కు మంచి విజయాలను అందించిన కథానాయకులలో చిరంజీవి,ప్రభాస్,ఎన్టీఆర్ లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

నాగార్జున కెరీర్‌లో మ‌రో స్పెష‌ల్ మూవీ అవుతుందా?

నాగార్జున కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాలలో అన్న‌మ‌య్య‌, మ‌నం త‌ప్ప‌కుండా ఉంటాయి. ఈ రెండు చిత్రాల‌కి ఓ ప్ర‌త్యేకత ఉంది. అదేమిటంటే.. ఆయా సినిమాలు మే నెలాఖ‌రులో విడుద‌ల‌వ‌డం.

రాజ‌మౌళితో మొద‌లుపెడుతున్న రామ్ చ‌ర‌ణ్‌

క‌థానాయ‌కుడిగా రామ్ చ‌ర‌ణ్ కెరీర్ మొద‌లై ప‌దేళ్ళు దాటింది. ఈ ప‌దేళ్ళ కాలంలో హీరోగా ప‌ది సినిమాలతో సంద‌డి చేశాడు చ‌ర‌ణ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 11 వ చిత్రం రంగ‌స్థ‌లం.. మార్చి 30న విడుద‌ల కానుంది.

మహేష్ అన్న తనయుడు సినిమాల్లోకి...

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లో టాప్ స్టార్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

విలన్ పాత్రలో తమిళ హీరో

కన్నడం,తెలుగులో విడుదలవుతున్న చిత్రం 'రాజారథం'.