2017 నాటి లైంగిక వేధింపుల కేసు.. ఐదేళ్ల తర్వాత దిలీప్‌పై నాన్‌బెయిలబుల్ కేసు
Send us your feedback to audioarticles@vaarta.com
ఐదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన మలయాళ హీరోయిన్ లైంగిక వేధింపుల కేసులో.. మల్లూవుడ్ స్టార్ హీరో దిలీప్‌పై తాజాగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్టు సమాచారం. దిలీప్.. ఫేమస్ మలయాళ నటిపై మనుషులను పెట్టించి మరీ లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. సదరు నటిని కారులో తిప్పుతూ.. లైంగిక వేధింపులకు గురి చేసి వదిలిపెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో దిలీప్‌ను 2017లో అరెస్ట్ కూడా చేశారు. అనంతరం బెయిల్‌పై వచ్చిన ఆయన .. సినిమాల్లో బిజీ అయిపోయారు.
2017 నుంచి దిలీప్‌పై కోర్ట్ కేసు నడుస్తున్నా.. కానీ నేటి వరకు తీర్పు రాకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఐదేళ్ళు గడుస్తున్నా.. ఇంత వరకూ దిలీప్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. బాధిత నటి కూడా పెళ్ళి చేసుకుని.. భర్తతో ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతోంది. ఇక అంతా సద్దుమణిగి ఎవరి జీవితాలు వారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు తెరపైకి రావడం మలయాళ పరిశ్రమలో ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే దీని వెనుక కారణం లేకపోలేదు.. నాటి ఘటనలో తనకు ఇంకా న్యాయం జరగలేదని బాధిత నటి ఇటీవల బయటకు వచ్చారు. తనకు ఇంకా న్యాయం జరగలేదంటూ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. సీఎం స్పందించడంతో పాటు ఇతర కారణాల చేత ఈ కేసు మళ్ళీ యాక్టీవ్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే దిలీప్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ కేసులో దిలీప్‌తో పాటు ఆయన తమ్ముడు, బావ, ఇతర కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout