'డియర్ కామ్రేడ్’ చూసి థియేర్‌లోనే ఏడ్చేశా..!

  • IndiaGlitz, [Saturday,July 27 2019]

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న నటీనటులుగా భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. జులై-26న విడుదలైన ఈ చిత్రంపై మంచి హిట్ టాక్ వచ్చింది. దేవరకొండ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చరచ్చజేస్తున్నారు. సినిమా ఆశించినంత దానికంటే బాగుందని.. ఖచ్చితంగా మరో ‘గీత గోవిందం’ అవుతుందని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఈ విజయ్, రష్మికతో పాటు చిత్రబృందం మీడియా మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

థియేటర్‌లో ఏడ్చేశా.. మరో సినిమా చేస్తున్నా!

ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. బాబీ, లిల్లీల జర్నీ ఇది. ఈ సినిమాతో నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమాకు చేయాల్సిందంతా ఒక్క ముక్క వదలకుండా చేశాను. నేను థియేటర్‌లోనే ఏడ్చేశాను. సినిమాపై వస్తున్న విమర్శలను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ కథను ఇలాగే చెప్పాలనుకున్నాం. ఈ సినిమా చేయడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమా యూనిట్‌ను చాలా మిస్సవుతున్నాను. మైత్రీ మూవీస్‌లో మరో సినిమా చేస్తున్నాను. ఈ సినిమా చాలా స్లో ఉన్న ఓపికతో చూడండి. కాకినాడలో డియర్ కామ్రేడ్ సక్సెస్ మీట్ ఉంటుంది అని విజయ్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు.

రివ్యూలపై రష్మిక కామెంట్స్ ఇవీ

ఇదిలా ఉంటే.. ‘డియర్ కామ్రెడ్’పై రివ్యూల గురించి రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషమేసిందని.. ఈ సినిమాలో భాగస్వామ్యమైనందుకు చాలా గర్వంగా ఉందని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

More News

బిగ్‌బాస్ హౌస్‌లో ఎఫ్2.. జాఫర్-భాస్కర్ అదుర్స్!!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ హౌస్‌ రోజు రోజుకు మంచి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఇందుకు కారణం హౌస్‌లో సిల్లీ పనులు, కామెడీలు,

'డియ‌ర్ కామ్రేడ్‌' కు కొత్త స‌మ‌స్య‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన రెండో చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`.

'డియ‌ర్ కామ్రేడ్‌' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

క‌ష్ట‌నష్టాల్లో మ‌న‌కు తోడుగా ఉండే వ్య‌క్తిని కామ్రేడ్ అంటాం. అలాంటి ఓ క్రామేడ్ ప్ర‌యాణ‌మే `డియ‌ర్ కామ్రేడ్‌`.విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించారు.

నాని అరాచకాలు జగన్‌కు కనిపించలేదా.. ఇలాచేస్తే అనాథే!?

వైసీపీ నేతలు.. ఆ పార్టీ అధినేతపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కోమటిరెడ్డి ఆలోచించు.. కేసీఆర్ ఆధారాలున్నాయ్!!

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు.