'డియర్ కామ్రేడ్’ చూసి థియేర్లోనే ఏడ్చేశా..!
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటీనటులుగా భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. జులై-26న విడుదలైన ఈ చిత్రంపై మంచి హిట్ టాక్ వచ్చింది. దేవరకొండ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చరచ్చజేస్తున్నారు. సినిమా ఆశించినంత దానికంటే బాగుందని.. ఖచ్చితంగా మరో ‘గీత గోవిందం’ అవుతుందని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఈ విజయ్, రష్మికతో పాటు చిత్రబృందం మీడియా మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
థియేటర్లో ఏడ్చేశా.. మరో సినిమా చేస్తున్నా!
"ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. బాబీ, లిల్లీల జర్నీ ఇది. ఈ సినిమాతో నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమాకు చేయాల్సిందంతా ఒక్క ముక్క వదలకుండా చేశాను. నేను థియేటర్లోనే ఏడ్చేశాను. సినిమాపై వస్తున్న విమర్శలను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ కథను ఇలాగే చెప్పాలనుకున్నాం. ఈ సినిమా చేయడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమా యూనిట్‌ను చాలా మిస్సవుతున్నాను. మైత్రీ మూవీస్‌లో మరో సినిమా చేస్తున్నాను. ఈ సినిమా చాలా స్లో ఉన్న ఓపికతో చూడండి. కాకినాడలో డియర్ కామ్రేడ్ సక్సెస్ మీట్ ఉంటుంది" అని విజయ్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు.
రివ్యూలపై రష్మిక కామెంట్స్ ఇవీ
ఇదిలా ఉంటే.. ‘డియర్ కామ్రెడ్’పై రివ్యూల గురించి రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషమేసిందని.. ఈ సినిమాలో భాగస్వామ్యమైనందుకు చాలా గర్వంగా ఉందని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments