మహేశ్ సినిమాలను ఫాలో అవుతానంటున్నవిదేశీ క్రికెటర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ సినిమాలను స్టార్ విదేశీ క్రికెటర్ రషీద్ ఖాన్ ఫాలో అవుతుంటాడట. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ స్వయంగా తెలియజేయడం విశేషం. వివరాల్లోకి వెళితే శుక్రవారం జరిగిన పైనల్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కలకత్తా, హైదరాబాద్ పోటీ పడిన సంగతి తెలిసిందే.
ఇందులో హైదరాబాద్ విజయం సాధించింది. అఫ్ఘనిస్తాన్కు చెందిన రషీద్ ఖాన్ ఆల్ రౌండర్ ప్రతిభ చూపించి టీమ్ సక్సెస్‌లో ముఖ్య భూమికను పోషించాడు. మ్యాచ్‌ను వీక్షించిన మహేశ్.. రషీద్‌ను అప్రిసియేట్ చేస్తూ ట్వీట్ చేశాడు. దానికి రషీద్‌ఖాన్ కూడా స్పందించాడు. థాంక్యూ బ్రో మీ సినిమాలను నేను కూడా ఫాలో అవుతుంటానని బదులివ్వడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com